పంచామృతంలో వున్న ఔషధగుణాలు

The Undertones Of Panchamrutham Temple1

హిందూ సంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యం వచ్చిన ముందుగా పంచామృతాలను ఉపయోగిస్తారు.అంతేకాక గుడిలోకి వెళ్ళినప్పుడు కూడా మనకు పంచామృతాలను ఇవ్వటం తరచుగా చూస్తూ ఉంటాం.

 The Undertones Of Panchamrutham Temple1-TeluguStop.com

స్వచ్ఛమైన ఆవుపాలు, తీపిగా వున్న పెరుగు, స్వచ్ఛమైన నేయి, తేనె, పంచదార మిశ్రమంను పంచామృతం అని అంటారు.ఈ పంచామృతంలో ఉండే ఐదు పదార్ధాలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.వాటి గురించి తెలుసుకుందాం.

ఆవుపాలు

ఆవుపాలలో కాల్షియం సమృద్ధిగా ఉండుట వలన ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది.అంతేకాక ఆవుపాలలో ఉండే ‘‘విటమిన్ ఏ’’ కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.

 The Undertones Of Panchamrutham Temple1-పంచామృతంలో వున్న ఔషధగుణాలు-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెరుగు

పెరుగు జీర్ణ సంబంధ వ్యాధులను నయం చేయటంలో సహాయపడుతుంది.అలాగే జుట్టు సంరక్షణలో కూడా బాగా సహాయపడుతుంది.

నెయ్యి

నెయ్యి మేధస్సును పెంచటంలో సహాయపడుతుంది.నెయ్యిలో ‘‘విటమిన్ ఏ’’ ఉండుట వలన చర్మం కాంతివంతంగా మారటానికి సహాయాపడుతుంది.అయితే నెయ్యిని చాలా మితంగా తీసుకోవాలి.

Telugu Cow Milk, Curd, Hindu Traditions, Honey, Panchamrutham, Shugar-Latest News - Telugu

తేనే

తేనే ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.తేనే చర్మ సంరక్షణలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.తేనెలో ఖనిజాలు సమృద్ధిగా ఉండుట వలన జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుంది.

పంచదార

పంచదార తక్షణ శక్తిని ఇస్తుంది.ఇన్ని మంచి గుణాలతో ఉన్న పంచామృతం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

#Honey #Cow Milk #Hindu #Curd #Shugar

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube