ఎటూ తేల్చుకోలేని టీమిండియా కెప్టెన్.. అసలు విషయం ఏమిటంటే..?!

ఇటీవల కాలంలో టీమ్ ఇండియా టీ20, వన్డే, టెస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఫార్మాట్ లో ఘన విజయాలు సాధిస్తూ నెంబర్ వన్ ప్లేస్ లో నిలుస్తోంది.టీమిండియా ఆటగాళ్లు టెస్ట్ సిరీస్ లలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్టులపై గెలిచి నెంబర్ వన్ స్థానంలో నిలిచి తాజాగా ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ కూడా దక్కించుకున్నారు.

 The Undecided Team India Captain The Real Thing Is Team India Captian, Virat Koh-TeluguStop.com

వరల్డ్ క్లాసిక్ క్రికెటర్లను కూడా చిత్తు చిత్తుగా ఓడించి తమ సత్తా చాటిన టీమిండియా ప్లేయర్స్ వరుస విజయాలతో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అయితే వారిందరికంటే ఎక్కువగా సంతోష పడాల్సిన విరాట్ కోహ్లీ మాత్రం తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారట.

ఎందుకు అని అడిగితే.టీమిండియా ఆటగాళ్ళందరూ కూడా ఒకరి మించి మరొకరు అద్భుతంగా ఆడటమేనట.

దీనివల్ల ఒక క్రికెటర్ ని పక్కన పెట్టి మరొక క్రికెటర్ కి ఛాన్స్ ఇవ్వడమనేది చాలా కష్టతరంగా మారిపోయింది.

ఆస్ట్రేలియా టూర్ నుంచి ఇండియన్ క్రికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారు.

ఇటీవల జరిగిన మ్యాచ్ లలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనపరిచి తాను ఫామ్ లోనే ఉన్నానని చెప్పకనే చెప్పారు.ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ గాయంతో తదుపరి మ్యాచుల నుంచి తప్పుకున్నారు.

దీంతో ఆయన స్థానంలో రిషబ్ పంత్ కి ఆడే అవకాశం ఇచ్చారు.అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రిషబ్ పంత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా దూసుకెళుతున్నారు.

Telugu @imvkohli, England, Process, Ups, India Captian, Virat Kohili-Latest News

కేఎల్ రాహుల్ కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తుండడంతో వీళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరిని రిజెక్ట్ చేయాలి అనే విషయంలో క్లారిటీ రాక విరాట్ కోహ్లీ సందిగ్ధతలో ఉండిపోయారు.నిజానికి కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ కి మంచి స్నేహితుడు.మరోవైపు రిషబ్ పంత్ మంచి ఆటగాడు.వీళ్ళిద్దరిలో ఎవర్ని జట్టులోకి తీసుకోవాలి అనే విషయంపై తుది నిర్ణయం తీసుకోలేక కోహ్లీ విచారం వ్యక్తం చేస్తున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube