ప్రజలను భయానికి గురి చేస్తున్న యూకే స్ట్రెయిన్‌ వైరస్.. భారత్‌లో కొత్తగా ఎన్ని కేసులంటే.. ?  

the uk strain virus that scares people how many new cases are there in india, india, corona, uk Strain Virus, new cases - Telugu Corona, India, New Cases, Uk Strain Virus

కరోనా సృష్టించిన అల్లకల్లోలం నుండి ఇప్పుడిప్పుడే భారతదేశ ప్రజలు కోలుకుంటున్నారన్న విషయం తెలిసిందే.అయినా వీడిపోని భయంతో జాగ్రత్తగా ఉండమని ఆరోగ్య శాఖ వారు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

TeluguStop.com - The Uk Strain Virus That Scares People How Many New Cases Are There In India

వ్యాక్సిన్ కూడా వచ్చిందనుకోండి.అలాగని నిర్లక్ష్యంగా ఉండటం సరికాదు.ఎందుకంటే కరోనాకు బంధువులు ఉన్నారు.దాంతో తగ్గిపోతుందనుకుంటున్న కరోనా భయం యూకే స్ట్రెయిన్‌ వైరస్‌ వల్ల మళ్లీ మొదలైంది.

గత రెండు రోజులుగా భారత్‌లో ఎలాంటి పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు కానీ, తాజాగా మంగళవారం కొత్తరకం 25 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

TeluguStop.com - ప్రజలను భయానికి గురి చేస్తున్న యూకే స్ట్రెయిన్‌ వైరస్.. భారత్‌లో కొత్తగా ఎన్ని కేసులంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో ఇప్పటి వరకు భారత్‌లో స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య 141కి చేరింది.

ఇక ఈ కొత్త రకం కరోనా వైరస్‌ మామూలు వైరస్‌ కన్నా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు గుర్తించారు.ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా బ్రిటన్‌ స్ట్రెయిన్‌ వైరస్‌ 50 దేశాలకు వ్యాప్తించిందని, ఇదే తరహాలో దక్షిణాఫ్రికా వేరియంట్‌ వైరస్‌ను కూడా 20 దేశాల్లో గుర్తించామని అంటున్నారు.

కాగా ప్రస్తుతం వాడకంలోకి వచ్చిన వ్యాక్సిన్స్‌ ఈ న్యూ స్ట్రెయిన్స్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయట.అదీగాక బ్రిటన్‌, దక్షిణ ఆఫ్రికాలో పుట్టిన కొత్త రకం వైరస్‌ లు కాకుండా మొత్తం నాలుగు రకాల కరోనా వైరస్‌లు ఇప్పటి వరకు బయటపడినట్లు గతంలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించిన విషయం తెలిసిందే.ఇక ఈ వార్తతో కొందరిలో అప్పుడే ఆందోళన మొదలైందట.

#India #Uk Strain Virus #Corona #New Cases

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు