బిగ్ బాస్ 5పై అవన్నీ పుకార్లే.. షో ప్రసారం అప్పుడేనట..?

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తెలుగు బిగ్ బాస్ షో పాలిట శాపంగా మారాయి.ఫస్ట్ వేవ్ వల్ల బిగ్ బాస్ సీజన్ 4 సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభం కాగా సెకండ్ వేవ్ వల్ల బిగ్ బాస్ సీజన్ 5 కూడా సెప్టెంబర్ 3వ వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

 The Tv Reality Show Bigg Boss Season 5 Starting Date Leaked-TeluguStop.com

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి ఉన్నా నేపథ్యంలో జులై, ఆగష్టులో బిగ్ బాస్ షోను ప్రారంభించడానికి బిగ్ బాస్ నిర్వాహకులు సుముఖంగా లేరని తెలుస్తోంది.

గతేడాదిలా బిగ్ బాస్ కంటెస్టెంట్లను క్వారంటైన్ లో ఉంచి కరోనా పరీక్షలు జరిపి షోను నిర్వహించాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారని సమాచారం.

 The Tv Reality Show Bigg Boss Season 5 Starting Date Leaked-బిగ్ బాస్ 5 పై అవన్నీ పుకార్లే.. షో ప్రసారం అప్పుడేనట..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ లో ఫేమ్ ఉన్న కంటెస్టెంట్లు ఎక్కువగా ఉండబోతున్నారని తెలుస్తోంది.ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పేర్లు వినిపించగా తాజాగా జర్నలిస్ట్ మూర్తి పేరు కూడా ఈ జాబితాలో వినిపిస్తూ ఉండటం గమనార్హం.

Telugu Bigg Boss 5, Bigg Boss 5 Update, Bigg Boss Show, Nagarjuna Host, September First Week, Starting Date Leaked, Tv5 Murthy-Movie

మరి మూర్తి బిగ్ బాస్ షో సీజన్ 5లో పాల్గొంటారో లేదో తెలియాలంటే షో ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.మరోవైపు బిగ్ బాస్ సీజన్ 5కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారని తెలుస్తోంది.బిగ్ బాస్ షో తెలుగు టీఆర్పీ పరంగా కూడా కొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ షోలో విన్ అయిన కంటెస్టెంట్లకు 50 లక్షల రూపాయలు ఫ్రైజ్ మనీగా లభిస్తుంది.

Telugu Bigg Boss 5, Bigg Boss 5 Update, Bigg Boss Show, Nagarjuna Host, September First Week, Starting Date Leaked, Tv5 Murthy-Movie

సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ షో లోగో, ప్రోమో రిలీజ్ అవుతాయని గత సీజన్లను మించిన ఎంటర్టైన్మెంట్ ఈ సీజన్ లో ఉండే విధంగా బిగ్ బాస్ నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నారని సమాచారం.ఈ సీజన్ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది.

#Nagarjuna Host #Bigg Boss Show #StartingDate #SeptemberFirst #Bigg Boss 5

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు