కీలక మలుపులు తిరుగుతున్న బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారం

తెలంగాణ భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతూ అధికారుల మెడకు చుట్టుకుంటోంది.ఇప్పటికే బీసీ కమీషన్ ఎదుట కరీంనగర్ సీపీ సత్యనారాయణ ఇతర పోలీస్ అధికారులు విచారణకు హాజరైన విషయం తెలిసిందే.

 The Turning Point Is The Arrest Of Bandi Sanjay/telangana Politics, Bandi Sanjay-TeluguStop.com

అయితే తాజాగా పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ బండి సంజయ్ అరెస్ట్ ఘటనపై విచారణకు హాజరు కావాలంటూ డీజీపీని ఆదేశించిన విషయం తెలిసిందే.దీంతో డీజీపీ బీజేపీ చీఫ్ ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ ఘటనపై ఎటువంటి సమాధానం ఇస్తారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా ఉంది.

అయితే కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా దీక్ష నిర్వహిస్తున్న కారణంగా మాత్రమే అరెస్ట్ ప్రక్రియను ఎంచుకున్నామని పోలీసులు తెలిపిన సమాధానానికి బీసీ కమీషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

దీక్ష ప్రాంగణం చుట్టూ పోలీసు ఫోర్స్ ను మోహరించి దీక్ష స్థలి వద్దకు ఎవరిని అనుమతించకుండా ఉంటే సరిపోతుంది కదా అని బీసీ కమీషన్ అభిప్రాయ పడింది.

అయితే ఈ విచారణ ప్రక్రియకు అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఇటువంటి విచారణలు సర్వ సాధారణమైనవని మరి కొంత మంది అభిప్రాయపడుతున్నారు.

ఏది ఏమైనా మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతూందనేది చూడాల్సి ఉంది.అయితే బీజేపీ మాత్రం పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం వల్లే బండి సంజయ్ అక్రమ అరెస్ట్ అనేది జరిగిందని ఆరోపిస్తోన్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ విచారణకు సంబంధించిన అంశంపై పెద్దగా స్పందిస్తున్న పరిస్థితి కనిపించడం లేదు.

విచారణ తరువాత పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది.డీజీపీ వివరణతో సంతృప్తి  చెందుతుందా లేక మందలించి వదిలేస్తుందా అనేది ఇప్పడు అందరిలో చాలా ఆసక్తిని రేకెత్తిస్ తోన్న అంశంగా మారింది.

The Turning Point Is The Arrest Of Bandi Sanjay/telangana Politics, Bandi Sanjay, Kcr, Trs Party , Bjp Party, Ts Poltics - Telugu @cm_kcr, @trspartyonline, Bandi Sanjay, Bjp, Telangana, Trs, Ts Poltics

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube