ఒక తండ్రి ఆవేదన.. ఇది చదివిస్తే పిల్లలను మరీ ఎక్కువ చదివించడం కూడా మంచిది కాదేమో అనే భయం మీకు కలుగక మానదు

కర్ణాటకకు చెందిన మృత్యుంజయ, కృష్ణ కుమారిలు భార్య భర్తలు.వీరికి ఇద్దరు పిల్లలు.

 The True Father Feels Sad About Her Childrens-TeluguStop.com

కూతురును ఉన్నత చదువులు చదివించి ఒక ఆస్ట్రేలియాలో సెటిల్‌ అయిన కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేశారు.కూతురు చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఆస్ట్రేలియాలో భర్తతో సంతోషంగా ఉంది.

ఇక కొడుకు వరుణ్‌ను ఉన్నత చదువులు చదివించారు.కొడుకు కూడా చెన్నైలో మంచి ఉద్యోగం చేస్తూ సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నాడు.కొడుకు, కూతురు ఇద్దరు కూడా వారి వారి సంసారాలతో సాఫీగా సంతోషంగా ఉన్నారు.అంతా బాగుందని భావిస్తున్న సమయంలో కూతురు గీతామణి తన పిల్లలను చూసుకునేందుకు ఇబ్బందిగా ఉంది అంటూ తల్లిదండ్రులను ఆస్ట్రేలియాకు రమ్మని అడిగింది.

కాని మృత్యుంజ మాత్రం తను ఆస్ట్రేలియాకు రాలేను అంటూ కూతురు ప్రతిపాధనను తోసిపుచ్చాడు.ఇద్దరం జాబ్‌ చేస్తున్నాం, ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది, కనీసం అమ్మను అయినా కొన్నాళ్లు ఆస్ట్రేలియాకు పంపించాల్సిందిగా కూతురు కోరంది.

దాంతో కూతురు మాట కాదనలేక కృష్ణ కుమారిని కొన్ని రోజుల పాటు అంటూ మృత్యుంజయ ఆస్ట్రేలియాకు పంపించాడు.అక్కడ నుండి నెలలు గడుస్తున్నా కూడా కృష్ణకుమారినిని గీతమణి పంపించడం లేదు.

మృత్యుంజయ ఒంటరి వాడు అయ్యాడు.ఎంత రిక్వెస్ట్‌ చేసినా, కోపంగా చెప్పినా కూడా కూతురు తల్లిని ఇండియాకు పంపించేందుకు నో చెప్పింది.

దాంతో అనారోగ్యం బారిన పడ్డ మృత్యుంజయ కొడుకు వరుణ్‌ వద్దకు వెళ్లాడు.కొడుకు కుటుంబ సభ్యులు కూడా మృత్యుంజయను సరిగా పట్టించుకోలేదు.

దాంతో తన కూతురుపై మృత్యుంజయ పోలీసు కేసు పెట్టాడు.తన భార్యను కూతురు ఆస్ట్రేలియా తీసుకు వెళ్లి పంపించడం లేదని, ఆమెను పంపించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలంటూ కేసు పెట్టాడు.


మృత్యుంజయ తనయుడు వరుణ్‌ కూడా తన సోదరిపై కేసు పెట్టాడు.తన తల్లిని ఆస్ట్రేలియాకు తీసుకు వెళ్లి వెనక్కు పంపేందుకు ఒప్పుకోడం లేదు అంటూ కేసులో పేర్కొన్నాడు.అయితే ఈ కేసులో కృష్ణ కుమారి అభిప్రాయం ఏంటీ అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.మొత్తానికి పిల్లలు ఉన్నత చదువులు చదువుకుని విదేశాల్లో, ఉన్నత ఉద్యోగాల్లో సెటిల్‌ అయితే ఆ తల్లిదండ్రులు పడే ఇబ్బందులకు ఈ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు.


.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube