నాడు వ‌ద్ద‌న్న దాని మీదే నేడు ఆధార‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌..

టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్య‌మ పార్టీ.ఒక‌ప్పుడు దీన్ని పొలిటిక‌ల్ పార్టీగా ఎవ‌రూ పిల‌వ‌లేదు.

 The Trs That Is Based Today On What Is Yours Today..,trs, Ts Politics-TeluguStop.com

కేసీఆర్ కూడా ఇదే విష‌యాన్ని తాను పార్టీ పెట్టిన‌ప్పుడు క్లియ‌ర్ గా చెప్పేశారు.తాను పెట్టింది ఉద్య‌మ పార్టీ అని కుండ బ‌ద్ద‌లు కొట్టేశారు.

ఎన్నో నిర‌స‌న‌లు, ధ‌ర్నాలతో తెలంగాణ‌నున సాధించిన పార్టీ టీఆర్ఎస్‌.నిజానికి ఇప్పుడున్న ఏ రాజ‌కీయ పార్టీ చేయ‌న‌న్ని నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు, ర్యాలీలు చేసింది కేవ‌లం టీఆర్ఎస్ పార్టీ మాత్ర‌మే.

ధ‌ర్నాలు, ర్యాలీల‌తో ఏం సాధించ‌వ‌చ్చో కేసీఆర్ కు తెలిసినంత మ‌రెవ‌రికీ తెలియ‌దేమో అని చెప్పాలి.

అయితే ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తీసుకున్న నిర్ణ‌యాలు అంద‌రినీ షాక్ కు గురి చేశాయి.

త‌న‌కు వ్యతిరేకంగా ఎవ‌రు నిర‌స‌న‌లు తెలిపినా ఉక్కు పాదంతో అణచి వేయ‌డాన్ని స్టార్ట్ చేశారు.మ‌రీ ముఖ్యంగా ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా చేస్తున్న ధర్నాలను అణ‌చి వేయొద్ద‌ని ఏకంగా ధర్నా చౌక్ ను ఎత్తేశారు.

దీంతో ఆయ‌న మీద తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.కానీ కేసీఆర్ మాత్రం ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా వాటిని లెక్క చేయ‌లేదు.కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఆయ‌నే ధ‌ర్నా నినాదాన్ని ఎత్తుకుంటున్నారు.అదే వ‌డ్ల విష‌యంలో.

Telugu Cm Kcr, Congress, Dharnachowk, Tg, Trs, Ts-Telugu Political News

కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ వ‌డ్ల‌ను కొన‌ట్లేద‌ని ఈరోజు 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు తెలుపుతున్న విష‌యం తెలిసిందే.ఇక్క‌డే అంద‌రూ షాక్ అవుతున్నారు.కేసీఆర్ వ‌ద్ద‌న్న ధ‌ర్నా చౌక్ లోనే ఇప్పుడు టీఆర్ఎస్ నేత‌లు నిర‌స‌న‌లు తెల‌ప‌డం ఏంటంని షాక్ అవుతున్నారు.

అంటే కేసీఆర్ తాను తీసుకున్న నిర్ణ‌యాల మీద నిల‌బ‌డ‌ర‌ని, త‌న‌కు అవ‌స‌రం అయితే ఎంత వ‌ర‌కు అయితే వెళ్తార‌నే విమ్ర‌శ‌లు సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్నాయి.ఇలా మొత్తానికి కేసీఆర్ ఏదైనా ఒక‌ప్పుడు వ‌ద్ద‌న్నారో ఇప్పుడు వాటి మీద‌నే ఆధార‌ప‌డుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube