ఆ సమావేశాల్లో టీఆర్ఎస్ అజెండా ఇదే ? టార్గెట్ కానున్న బీజేపీ ?

తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు మరింత తీవ్రతరం అయింది.ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

 The Trs Strategy Is To Embarrass The Bjp In Parliament Sessions Trs, Telangana, Kcr, Bjp, Trs Government, Parlament Meeting, Target Bjp Hujurabad, Dubbaka Elections, Telangana Cm,-TeluguStop.com

దుబ్బాక,  హుజురాబాద్ ఉప ఎన్నికల తరువాత తెలంగాణలో బీజేపీ మరింత స్పీడ్ పెంచింది.అధికార పార్టీ టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుంటూ బీజేపీ అగ్రనేతల నుంచి రాష్ట్ర నేతల వరకు ప్రయత్నాలు చేస్తుండటం,  ప్రతి విషయంలోనూ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజల్లో అభాసుపాలు చేసేందుకు ప్రయత్నించడం ఇలా అనేక విషయాల్లో టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకోవడంతో బీజేపీపై ఏదోవిధంగా పైచేయి సాధించాలని,  రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా బీజేపీ కి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించాలని టిఆర్ఎస్ డిసైడ్ అయి పోయింది.

కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ ని ఇరుకున పెట్టే విధంగా ఢిల్లీ స్థాయిలో రాజకీయ చక్రం తిప్పాలని తాజాగా టిఆర్ఎస్ డిసైడ్ అయింది.పార్లమెంట్ సమావేశాల్లో టిఆర్ఎస్ ఎంపీ లు అనుసరించాల్సిన వ్యూహం పైన ప్రధానంగా పార్టీ ఎంపీలతో కేసీఆర్ కీలక సమావేశాన్ని నిర్వహించారు.

 The Trs Strategy Is To Embarrass The Bjp In Parliament Sessions TRS, Telangana, Kcr, BJP, Trs Government, Parlament Meeting, Target Bjp Hujurabad, Dubbaka Elections, Telangana Cm, -ఆ సమావేశాల్లో టీఆర్ఎస్ అజెండా ఇదే టార్గెట్ కానున్న బీజేపీ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా కేంద్ర బీజేపీ  ప్రభుత్వం పై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ 7:30 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఏం చేసిందనే విషయాన్ని హైలెట్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ను ప్రైవేటీకరణ చేయడం వంటి వ్యవహారాలను ప్రశ్నించాలని నిర్ణయించుకుంది.

ఇప్పటికే సింగరేణి బొగ్గు గనుల వేలం పైన , ఐఏఎస్ సర్వీస్ రూల్స్ లో సవరణలు, ఎరువుల ధరల పెంపు ఇలా అనేక అంశాలపై కేంద్రానికి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు.అయినా కేంద్రం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఈ విషయాల పై పార్లమెంటులోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు.తెలంగాణలో నెలకొన్న సమస్యల తో పాటు,  దేశవ్యాప్తంగా బీజేపీ  అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక వైఖరి పైన గట్టిగా నిలదీయాలని, తద్వారా బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతు తమకు ఉంటుందని, ఈ పరిణామాలు భవిష్యత్తులో టిఆర్ఎస్ కు మరింత మేలు చేస్తాయని కేసీఆర్ డిసైడ్ అయ్యారు.ఈ మేరకు పార్టీ ఎంపీల ద్వారా బిజెపిని ఇరుకున పెట్టేందుకు పార్లమెంట్ సమావేశాలను ఉపయోగించుకో బోతున్నారట.

The Trs Strategy Is To Embarrass The Bjp In Parliament Sessions TRS, Telangana, Kcr, BJP, Trs Government, Parlament Meeting, Target Bjp Hujurabad, Dubbaka Elections, Telangana Cm, - Telugu Dubbaka, Targetbjp, Telangana, Telangana Cm, Trs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube