పక్కా ప్లానింగ్ తో కదులుతున్న టీఆర్ఎస్ పార్టీ...అసలు వ్యూహం ఇదేనా

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి.ఇప్పటికే కేసీఆర్ చాలా స్పష్టతతో ముందుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం.

 The Trs Party Is Moving With Perfect Planning  Is This The Real Strategy , Telan-TeluguStop.com

పాలనాపరమైన నిర్ణయాలలో కొత్త దనం చూపిస్తూ ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేస్తున్న పరిస్థితి ఉంది.అయితే చాలా వరకు తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని చాలా స్పష్టంగా చెప్పగలిగే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది.

తద్వారా తెలంగాణలో రెండో దఫా ప్రభుత్వం ఏర్పడ్డాక ఏమేమి మార్పులు జరిగాయో వాటిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం బీజేపీ నుండి తీవ్ర పోటీ ఎదుర్కోనున్న తరుణంలో బీజేపీ విమర్శలకు సరైన సమాధానం ఇవ్వాలంటే అభివృద్ధితోనే సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం.

అయితే ఇప్పటివరకు బీజేపీ ఎన్ని విమర్శలు చేసినా కేసీఆర్ మౌనంగా ఉండడానికి కారణం బీజేపీ విమర్శలు చేసి ఇక విమర్శించడానికి ప్రత్యేకంగా ఏమీ లేకుండా చేసి ఇక ప్రజలకు ఒక్కసారిగా అభివృద్ధి ఫలాలు అందితే ఇక ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి ఉండదు అనేది కేసీఆర్ ప్రత్యేక వ్యూహంగా అనిపిస్తోంది.అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలలో ప్రతిష్టాత్మక సంక్షేమ పధకం హరితహారం.

హరితహారం పధకం కారణంగా తెలంగాణ గ్రీన్ కవర్ అనేది పెరిగిందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజా గణాంకాల ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే.దీంతో హరితహారం పధకంతో  ఎంతగా లాభం జరిగిందో కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా తెలియడంతో ఇక ప్రభుత్వ ఖాతాలో మరో విజయం అనేది చేరినట్లయింది.

ఇలా ఇప్పటికే చాలా రకాలుగా అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాయని రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి ఫలాలు ప్రజలు అందుకోబుతున్నట్టుగా  కేసీఆర్ ప్రజలకు తెలిపే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube