రేవంత్ మాములోడు కాదు ! టీఆర్ఎస్ ఎలా ఎదుర్కోబోతోంది అంటే ?

తెలంగాణ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నాడు అనే ఆసక్తి ఆ పార్టీ నాయకుల కంటే,  టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎక్కువగా ఆసక్తి ,టెన్షన్ కలిగిస్తోంది.ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ వంటివారు రేవంత్ కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు.

 Revanth Reddy, Trs, Telangana Government, Hujurabad Congress, Pcc President, Trs-TeluguStop.com

వాస్తవంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభావం ఏమాత్రం ఉండదని, ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గడంతో పాటు , అసలు తమకు పోటీనే కాదు అన్నట్లుగా టిఆర్ఎస్ తో సహా మిగతా రాజకీయ పార్టీలన్ని చూస్తూ వచ్చాయి .అయితే ఇప్పుడు మాత్రం ఆ అభిప్రాయం మార్చుకున్నాయి.

రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి దక్కడం తో ఆయన దూకుడుగా ముందుకు వెళ్లడం తో పాటు, తెలంగాణ లో రాజకీయ సమీకరణాలు మార్చగలరని ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీలు బయపడుతున్నట్టుగా కనిపిస్తోంది.అసలు ఆ పదవి రాకముందే దూకుడుగా ముందుకు వెళుతూ ఉండేవారు.

పిసిసి అధ్యక్షుడి హోదాలో ఆయన మరింత పొలిటికల్ స్పీడ్ పెంచుతారు అనే భయం కెసిఆర్ లో ఎక్కువ కనిపిస్తోంది.అందుకే రేవంత్ప్రభావాన్ని తగ్గించేందుకు మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

Telugu Congress, Pcc, Revanth Reddy, Telangana, Trs-Telugu Political News

త్వరలోనే హుజురాబాద్ ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి వలసలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని, వీలైనంత మంది నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా రేవంత్ నాయకత్వం పై వారికి నమ్మకం లేకపోవడంతోనే తమ పార్టీలో చేరారని చెప్పుకునేందుకు అవకాశం ఉంటుందని,  దీని ద్వారా కాంగ్రెస్ బలహీనం కావడంతో పాటు,  రేవంత్  పై పార్టీ నాయకుల్లోనూ అనుమానాలు కలుగుతాయి అనే ప్లాన్ లో కేసీఆర్ ఉన్నారట.  అందుకే ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీసే విధంగా గులాబీ బాస్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా కనిపిస్తున్నారు.మరి ఈ ప్రయత్నాలకు రేవంత్ ఎలా బ్రేకులు వేస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube