రెండురోజుల్లో తెలంగాణ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు.. టీఆర్ ఎస్‌కు పెద్ద షాక్‌

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడు జోష్ మీద ఉన్నాయంటే అవి కాంగ్రెస్‌, బీజేపీ అని మాత్ర‌మే చెప్పాలి.ఎందుకంటే ఓ వైపు బీజేపీ పాద‌యాత్ర‌లు బ‌హిరంగ స‌భ‌ల‌తో హోరెత్తిస్తుంటే మ‌రోవైపు రేవంత్‌రెడ్డి హ‌యాంలోని కాంగ్రెస్ ద‌ళిత‌, గిరిజ‌న దండోరాల‌తో దుమ్ములేపుతున్నారు.

 The Tremors In Telangana Politics In Two Days A Big Shock To Trs-TeluguStop.com

కానీ అధికార టీఆర్ ఎస్ పార్టీ మాత్రం ఎలాంటి చ‌ల‌నం లేకుండా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉంటున్నారు.ఇక‌పోతే సెప్టెంబ‌ర్ 17న రాజ‌కీయ పోరు మ‌రింత ఉధృతం కానున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక 17వ నిర్మల్ లో తెలంగాణ విమోచ‌న బహిరంగ సభను బీజేపీ ఏర్పాటు చేస్తోంది.

 The Tremors In Telangana Politics In Two Days A Big Shock To Trs-రెండురోజుల్లో తెలంగాణ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు.. టీఆర్ ఎస్‌కు పెద్ద షాక్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఢిల్లీ నాయ‌క‌త్వాన్ని ఈ స‌భ‌కు తీసుకువ‌స్తోంది.

దీనికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ‌చ్చి బీజేపీకి దిశానిర్ధేశం చేయ‌నున్నారు.ఇక ఆయ‌న ఏం చెబుతారో అని అంతా ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నారు.

ఆరోజు తెలంగాణ రాజ‌కీయాల్లో అమిత్ షా చేసే వ్యాఖ్య‌లు కీల‌కం కానున్నాయి.ఇక ఇప్పటికే సంజయ్ త‌న పాద‌యాత్ర‌తో రాష్ట్ర వ్యాప్తంగా జోష్ పెంచుతున్నారు.

ఇక దీనికి తోడు అమిత్ షా రాకతో బీజేపీలో ఫుల్ జోష్ వ‌స్తోంది.ఇక అదే రోజున కాంగ్రెస్ కూడా గజ్వేల్ లో బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది.

కాగా దీనికి రాహుల్ గాంధీ వ‌స్తున్నార‌నే సంకేతాలు వినిపించాయి.

Telugu Amit Shan, Bandi Sanjay, Bandi Sanjay Padayatra, Bjp, Congress, Kcr, Rahul Gandhi, Revanth Reddy, Telangana Politics, Telangana Viyochana Meeting-Telugu Political News

కానీ ఆయ‌న రాక‌పై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.కానీ ఈ స‌భ కూడా భారీ ఎత్తున నిర్వ‌హిస్తోంది కాంగ్రెస్ పార్టీ.ఇక దీన్ని కూడా తెలంగాణ విమోచ‌న దినం సంద‌ర్భాగానే నిర్వ‌హిస్తున్నా కూడా గిరిజన ఆత్మ గౌరవ సభ అని చెబుతోంది కాంగ్రెస్.

అయితే ఈ స‌భ‌పై భారీగా అంచ‌నాలు ఉన్నాయి.ఎందుకంటే ఈ స‌భ కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో పెట్ట‌డంతో ఏం జ‌రుగుతుందో అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక కాంగ్రెస్ స‌భ‌ను అడ్డుకునేందుకు టీఆర్ ఎస్ కూడా ప్లాన్ వేస్తోంద‌ని రేవంత్ ఇప్ప‌టికే ఆరోపిస్తున్నారు.సెప్టెంబ‌ర్ 17న ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.

.

#Amit #Rahul Gandhi #BandiSanjay #Revanth Reddy #Congress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు