బ్రిటిషర్ల కాలం నాటి రైలు.. మరలా కూత పెట్టనుంది

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నాయి.స్వాతంత్ర్య పోరాటంలో మన పూర్వీకులు పడిన కష్టాలను తెలిపే ఎన్నో అవగాహన కార్యక్రమాలు అమలు చేస్తోంది.

 The Train Of The British Era.. Will Be Put Up Again  British, Train, Journey, Ra-TeluguStop.com

ముఖ్యంగా ప్రతి ఇంటిపై జెండా ఎగుర వేయాలని కేంద్రం కోరుతోంది.ఇక దేశవ్యాప్తంగా ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేస్తున్నారు.

ఈ క్రమంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.దక్షిణ రైల్వే పరిధిలో ఓ ఆసక్తికర కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

చెన్నై ఎగ్మోర్ నుండి కోడంబాక్కం వరకు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వర్కింగ్ స్టీమ్ లోకోమోటివ్ EIR – 21‌ను రన్ చేయనున్నారు.ఇది ఎంత పురాతనమైనదంటే 1855లో దీనిని తయారు చేశారు.

అప్పటి రైలును ప్రస్తుతం మరలా పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

అత్యంత పురాతనమైన వర్కింగ్ స్టీమ్ లోకోమోటివ్ EIR – 21‌ను ఎన్నో ఏళ్ల క్రితం తయారు చేశారు.1855లో దీనిని తయారు చేసి, అప్పట్లో పట్టాలు ఎక్కించారు.లోకో వర్క్స్, పెరంబూర్ 1909లో సర్వీస్ నుండి వైదొలిగిన తర్వాత 2010 సంవత్సరంలో స్టీమ్ లోకోను పునరుద్ధరించింది.దాని పునరుద్ధరణ నుండి ప్రతి సంవత్సరం హెరిటేజ్ రన్‌ చేపడుతున్నారు.

లోకో జమాల్‌పూర్ వర్క్‌షాప్‌లు, హౌరా స్టేషన్‌లో 101 సంవత్సరాలకు పైగా ప్రదర్శించబడింది.EIR 21 GPS ఆధారిత స్పీడోమీటర్ వంటి ఆధునిక సాంకేతికతలకు కూడా అనుగుణంగా ఉంటుంది.

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వర్కింగ్ స్టీమ్ ఇంజన్‌తో కూడిన రైలు ఇది.హెరిటేజ్ స్పెషల్ లోకోమోటివ్ EIR-21 నగరంలోని ఎగ్మోర్ నుండి కోడంబాక్కం రైల్వే స్టేషన్‌ల మధ్య రెండు స్టేషన్‌లను కవర్ చేస్తుంది.ఈ మార్గంలో భారీగా జనం తరలి వస్తారు.EIR-21ను 2010 నుంచి వరుసగా ప్రతి ఏటా ఆగస్టు 15న నడుపుతున్నారు.ఇది ఫెయిరీ క్వీన్, మరొక ఆవిరి ఇంజిన్‌ను పోలి ఉంటుంది.ఈ రైలు ఎప్పుడో పక్కన పెట్టేయడగా, తిరిగి ఆగష్టు 15, 2010న హెరిటేజ్ రన్ చేపట్టింది.అప్పటి నుంచి ప్రతి ఏటా హెరిటేజ్ రన్ నిర్వహిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube