రేవంత్ రెడ్డి గృహ నిర్భంధం

తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.కోకాపేటలో వేలం వేసిన ప్రభుత్వ భూముల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

 Tpcc Chief Revanth Reddy House Arrest Over Questioning Kokapet Land Issues , Tpc-TeluguStop.com

ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కోకాపేట లో ప్రభుత్వ భూములు సందర్శన, ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.కోకాపేట భూముల వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు.

దీంతో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ ఆ పార్టీ జెండాను పోతారు.ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.

పిసిసి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, పి జి సి కరీంనగర్ అధ్యక్షులు జగ్గారెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహా రెడ్డి , టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పిసీసీ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కోదండరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Telugu Damodararaja, Jagga, Kokapet-Political

ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు సోమవారం తెల్లవారుజామున రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించారు.రేవంత్ రెడ్డి ని గృహనిర్బంధం చేశారు.పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube