పెట్రోల్ రేట్లు చూసి భయపడుతున్నారా..ఈ చిట్కాలు ఉపయోగించి పెట్రోల్ ని ఆదా చేస్కోండి..20వది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి.

రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్న పెట్రోల్ రేట్లను చూస్తే.బండి పక్కన పడేసి సైకిల్ కొనుక్కోవడం ఉత్తమం, నడుచుకుంటే వెళ్తే వాకింగ్ కూడా అయినట్టు ఉంటుంది.

 The Top 10 Tips For Drivers To Save On Petrol Use-TeluguStop.com

మన బండిని అమ్ముకుని ఆర్టీసి బస్సుని నమ్ముకోవడం బెటర్ లాంటి ఆలోచనలు ఎన్నో వస్తుంటాయి.కానీ ఉరుకుల పరుగుల జీవితంలో చేతిలో సొంత బండి ఉండడం చాలా చాలా అవసరం.

అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే పెట్రో రేట్ల చిక్కులనుండి తప్పించుకోవచ్చు.అవేంటో మీరే చదవండి.

· తక్కువ వేగంతో ఓవర్ స్పీడ్‌గా వెళ్తే మీ ప్రాణాలను రిస్క్‌లో పడెయ్యడమే కాదు పెట్రోల్ కూడా అంతే స్థాయిలో ఖర్చయిపోతుంది.తక్కువ వేగంతో వెళ్లడం పెట్రోల్‌ని ఆదా చేస్తుంది.

· పదేపదే గేర్లు మారిస్తే మైలేజీ తగ్గిపోతుంది.అందుకే ఎక్కువ దూరం ఒకే గేర్‌పై వెళ్లేలా చూసుకోండి.

· ఎమిషన్ టెస్ట్ చేయించిన వాహనం 4 శాతం పెట్రోల్‌ని ఆదా చేస్తుంది.

· ఆక్సిజన్ సెన్సార్‌తో 40 శాతం మైలేజీ పెరుగుతుంది.

· టైర్లు మంచి కండీషన్‌తో ఉంటే పెట్రోల్ కూడా ఆదా అవుతుంది.

· ఓనర్స్ గైడ్‌లో సూచించిన గ్రేడ్ మోటార్ ఆయిల్ మాత్రమే వాడాలి.

· సరైన మోటార్ ఆయిల్ వాడకపోతే మీ పెట్రోల్ ఖర్చులు 2 శాతం పెరుగుతాయి.

· ఫ్యూయెల్ ఫిల్టర్స్, స్పార్క్ ప్లగ్స్, వీల్ అలైన్‌మెంట్, ఎమిషన్ సిస్టమ్ తరచూ పరిశీలిస్తుండాలి.

· ఉదయం వేళల్లోనే పెట్రోల్ ట్యాంకు నింపాలి.

· పూర్తిగా ఖాళీ కాక ముందే సగం ఖాళీ అయినప్పుడే ట్యాంకు నింపాలి.

· లోయెస్ట్ గేర్‌ కన్నా హయ్యెస్ట్ గేర్‌లోనే డ్రైవింగ్ చేయాలి.

· వాహనాన్ని తరచూ సర్వీసింగ్ చేయిస్తుండాలి.

· బ్రేక్స్, యాక్సిలేటర్‌ హార్డ్‌గా ఉపయోగించొద్దు.

· టైర్ ప్రెజర్ పరిశీలిస్తుండాలి.

· వేగం పెంచుతూ, తగ్గిస్తూ కాకుండా ఒకే స్పీడ్‌లో వాహనాన్ని నడపాలి.

· ట్రాఫిక్ తక్కువగా ఉండే సమయంలో ప్రయాణించడం మంచిది.

· పెట్రోల్ లీకేజీ సమస్యలు ఉంటే రిపేర్ చేయించాలి.

· కార్ పూలింగ్, బైక్ పూలింగ్ సేవలు ఉపయోగించుకోవాలి.

· కిలోమీటర్ దూరంలోపు వెళ్లాలంటే వాహనం కన్నా నడవడం మంచిది.

· మీ స్నేహితులు వాహనం తీసుకెళ్తే పెట్రోల్ పోయించమని నిర్మొహమాటంగా చెప్పాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube