సాధారణంగా సముద్ర భాగంలో జీవించే జీవుల్లో ఎక్కువుగా మాంసాహారులే ఉంటాయి.ఇవి చాలా హానికరమైనవి మరియు ప్రాణాంతకమైనవి.
ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి తమ లోని విషాన్ని బయటకు కక్కుతాయి.ఈ సముద్ర భాగంలో జీవించే జీవుల్లో మనుషులకు హాని చేసేవి కూడా ఉంటాయి.
అవి చాలా డెంజర్.
కేవలం మనుషులనే కాదు ఇవి ఒక జీవి మీద దాడి చేసి వాటి ఆకలిని తీర్చుకుంటూ ఉంటాయి.
ఈ వేట అనేది ప్రకృతి దర్మం అని అంటూ ఉంటారు.ఏ జీవి అయినా మరొక జీవిని వేటాడి బతకాల్సిందే.లేకపోతే వారి మనుగడ కష్టమే.కానీ ఇలా వేటాడే అప్పుడు ఒక్కోసారి కొన్ని అనుకోనివి జరుగుతూ ఉంటాయి.
అలాంటివి వింటే మనం ఆశ్చర్య పోవడం ఖాయం.అసలు అలా ఎలా జరుగుతుందో మనకి అర్ధం కూడా కాదు.
కానీ అవి నిజం.అలంటి ఉహించనివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి.ఇలా ఆశ్చర్యం కలిగించే ఘటనలు ఇప్పటి వరకు చాలా జరిగాయి.కానీ ఇప్పడు చెప్పుకునే స్టోరీ మాత్రం అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది.ఈ పరాన్న జీవి స్టోరీ తెలుసు కోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అమెరికా టెక్సాస్ కు చెందిన పార్క్ లో ఒక పరాన్న జీవి బయట పడింది.అయితే అది బయట కనిపించే లేదు.అది ఒక చేప నోటిలో కనిపించింది.
అట్లాంటిక్ క్రోకర్ అనే ఒక జాతి చేప నోటిలో ఈ పరాన్న జీవి బయట పడింది.దీనిని పరిశీలించగా నాలుక ఉండాల్సిన స్థానంలో ఆ పరాన్న జీవి ఉండడంతో మొదటిగా షాక్ అయ్యారు.
ఆ చేప నాలుకను ఆ పరాన్న జీవి తినేసి ఆ చేప నోటిలో నాలుకలాగా అతుక్కుపోయినట్టు పరిశోధకులు చెబుతున్నారు.