ఇదేం స్టైల్ అండి బాబు... సినిమా పేరునే కన్ఫ్యూజ్ చేశారుగా!

The Tollywood Movies Name Are Confusing

అప్పుడప్పుడు మనకు చూపు లోపం వలనో లేదా అక్షరాల రాత వల్లనో కొన్ని కొన్ని సార్లు పొరపాటు పడుతూ ఉండటం.చెప్పాలంటే పప్పులో కాలేస్తాం.

 The Tollywood Movies Name Are Confusing-TeluguStop.com

ఎందుకంటే మనకే చూపు లోపం ఉంటే అది మనది తప్పు.కానీ అవతలివాళ్ళు రాసిన పదాలలో కాస్త స్టైల్ ఫోంట్ జోడిస్తే అందులో కూడా మనలో చూపు లోపమే కనిపిస్తుంది.

ఎందుకంటే రాసే వాళ్ళు తమకు నచ్చినట్లు రాసుకుంటూ వెళ్తారు.కానీ మనం చూసే విధానం లో తొందర్లో రాసిన పదాన్ని అర్థం కాక మరోలా చదువుతాం.

 The Tollywood Movies Name Are Confusing-ఇదేం స్టైల్ అండి బాబు… సినిమా పేరునే కన్ఫ్యూజ్ చేశారుగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాంటివి ఫోంట్ స్టైల్స్ ఎక్కడపడితే అక్కడ కనిపించవు.కేవలం ఎవరైనా బుక్స్ లలో రాసినప్పుడు లేదా సినిమా టైటిల్స్ సమయాలలో మాత్రమే పదాలు కాస్త వెరైటీ గా కనిపిస్తూ ఉంటాయి.

మరీ ఎక్కువగా అయితే సినిమా టైటిల్స్ లోనే చూస్తాము.టైటిల్ లోని మొదటి అక్షరం స్టైల్ గా ఉంటే అది మనకు వేరే అక్షరములా కనిపిస్తూ ఉంటుంది.

దానివల్ల మనం అలాగే చదవడంతో పొరపాటు జరుగుతూ ఉంటుంది.ఇక మీరు కూడా చాలాసార్లు సినిమా టైటిల్ విషయంలో పొరపాటు పడి ఉండొచ్చు.

ఇదిలా ఉంటే అక్షరాల స్టైల్ తో కొన్ని సినిమా పేర్లు ఎలా చదివామో.ఇంతకు ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

నా పేరు శివ: సుసీంద్రన్ దర్శకత్వంలో 2010 లో తెరకెక్కిన సినిమా నా పేరు శివ.ఇందులో కార్తిక్ శివకుమార్, కాజల్ అగర్వాల్ నటీనటులుగా నటించారు.ఇక ఈ సినిమా టైటిల్ మనకు చూపించే విధానంలో అక్షరాలను కాస్త రఫ్ గా చూపించారు.ఇక అందులో ‘పే’ అనే అక్షరం ‘లే’ అని ఉండటంతో అందరూ ‘నా లేరు శివ’ అని పొరపాటు పడ్డారు.

Telugu Greekuveerudu, Na Peru Shiva, Names, Tollywood-Movie

నువ్వంటే నాకిష్టం: 2005లో ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో విడుదలైన సినిమా నువ్వంటే నాకిష్టం.ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్, అనురాధ మెహతా నటీ నటులుగా నటించారు.ఇక ఈ సినిమా పేరు రంగురంగులతో కాస్త స్టైల్ గా చూపించారు.

కానీ అందులో ‘ను’ అనే పదం ‘గు’, ‘నా’ అనే పదం ‘గా’ లాగా కనిపించడం తో ‘గువ్వంటే గాకిష్టం’ అని పొరపాటు పడ్డారు.

గ్రీకు వీరుడు: 2013లో కొండపల్లి దశరథ్ దర్శకత్వంలో విడుదలైన సినిమా గ్రీకువీరుడు.ఇందులో నాగార్జున, నయనతార నటీనటులుగా నటించారు.ఇక ఈ సినిమా పేరు లో ‘గ్రీ’ అనే అక్షరం ‘శ్రీ’ లాగా కనిపించటంతో చాలా వరకు ‘శ్రీకువీరుడు’ అని చదివి పొరపాటు పడ్డారు.

Telugu Greekuveerudu, Na Peru Shiva, Names, Tollywood-Movie

తేజ్ ఐ లవ్ యు: 2018లో కరుణాకరణ్ దర్శకత్వంలో విడుదలైన సినిమా తేజ్ ఐ లవ్ యు.ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ నటీనటులుగా నటించారు.ఇందులో ‘తే’ అక్షరం కాస్త స్టైల్ గా ఉండటంతో అది కాస్తా ‘క్రే’ గా కనిపించడంతో క్రేజ్ ఐ లవ్ యు చదివారు కొందరు ప్రేక్షకులు.

#Names #Greekuveerudu #Peru Shiva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube