మెగా చిన్న మేనల్లుడి కోసం టైటిల్‌ రిజిస్ట్రర్‌ అయ్యింది... ఆసక్తి రేపుతున్న టైటిల్‌  

The Title Registration For Mega Little Nephew-movie Updates,registration,teaser,title,vaishnav Tej,మెగా చిన్న మేనల్లుడి

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అయ్యి సక్సెస్‌ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే సాయి ధరమ్‌ తేజ్‌ ఒక మోస్తరు గుర్తింపును దక్కించుకున్నాడు. తనకాళ్లపై తాను నిల్చునేందుకు తేజ్‌ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు..

మెగా చిన్న మేనల్లుడి కోసం టైటిల్‌ రిజిస్ట్రర్‌ అయ్యింది... ఆసక్తి రేపుతున్న టైటిల్‌-The Title Registration For Mega Little Nephew

ఈ సమయంలోనే ఆయన తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ కూడా రంగంలోకి దిగుతున్న విషయం తెల్సిందే. బాలనటుడిగా ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన వైష్ణవ్‌ మొదటి సినిమాను మైత్రి మూవీస్‌ బ్యానర్‌లో చేస్తున్నాడు. సుకుమార్‌ శిష్యుడు ఈ చిత్రంకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రంలో వైష్ణవ్‌ తేజ్‌ చాలా మాస్‌గా కనిపించబోతున్నట్లుగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చూస్తే అనిపించింది. ఆ పోస్టర్‌లో నిజం ఎంత అనే విషయాన్ని పక్కకు పెడితే నిన్న మొన్నటి వరకు ఈ చిత్రంకు ‘జాలరి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జాలరి అనే టైటిల్‌ను అసలు పరిశీలించడం లేదని, ఆ టైటిల్‌తో సినిమా చేయబోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ చిత్రం కోసం మైత్రి వారు ఫిల్మ్‌ ఛాంబర్‌లో ‘ఉప్పెన’ అనే టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించాడట.

ఈ చిత్రం కథ నేపథ్యంకు ఉప్పెన టైటిల్‌ బాగా సూట్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయంకు వచ్చినట్లుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఈ చిత్రం గురించి మీడియాలో వార్తలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఎందుకంటే అంచనాలు లేకుండా ఈ చిత్రంను విడుదల చేయాలనేది యూనిట్‌ సభ్యుల ప్లాన్‌గా తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ చిత్రంకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇదే ఏడాది ద్వితీయార్థంలో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి..