మిస్సింగ్ కేసుగా నమోదైన ఓ వ్యక్తి శవమై తేలాడు.పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయగూడెంకు చెందిన రైతు గడా భాస్కరరావు (55) గత కొద్ది రోజుల కిందట కనిపించడం లేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, కొందరు వ్యక్తులు సోమవారం పుట్టగొడుగుల కోసం వెళ్లినప్పుడు అసంపూర్తిగా పూడ్చిపెట్టిన శవాన్ని చూశారు.దీంతో స్థానిక పోలీసులకు సంప్రదించాడు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భాస్కరరావుగా గుర్తించారు.దీంతో మృతదేహాన్ని అక్కడికక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.
నాలుగు రోజులుగా కనిపించని రైతు గడా భాస్కరరావు హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు మంగళవారం మృతదేహాన్ని బయటకు తీయించారు.శవాన్ని అక్కడికక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.అనంతరం మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న కేసును హత్య కేసుగా మార్చుకున్నారు.
పోస్టుమార్టంలో ఆధారాలు సేకరించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
దేవరపల్లి మండలం చిన్నాయగూడెంకు చెందిన రైతు గడా భాస్కరరావుకు పిల్లలు లేరు.భార్య కూడా ఇటీవలే చనిపోయింది.
దీంతో భాస్కరరావు మరో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు.ఈ క్రమంలో తనకున్న ఆస్తి వేరే వారికి పోతుందన్న కక్షతో బంధువులెవరైనా చంపి ఉండారని అనుమానిస్తున్నారు పోలీసులు.
భాస్కరరావుకు శత్రువులు కూడా పెద్దగా లేరని విచారణలో తేలిందన్నారు.క్లూస్ టీం సాయంతో త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.