రోడ్డు ప‌క్క‌న కారును వ‌దిలి వెళ్లిన దుండ‌గులు.. లోప‌ల ఏముందో చూస్తే..

యువ‌త‌ను పెడ‌దోవ ప‌ట్టిస్తున్న గంజాయి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎంత‌లా హాట్ టాపిక్ అవుతుందో అంద‌రికీ తెలిసిందే.దీని మీద రాజీకీయాల్లో పెను ప్ర‌కంప‌న‌లే రేపుతున్నాయి.

 The Thugs Left The Car On The Side Of The Road If You Look Inside Details, Car,-TeluguStop.com

గంజాయి అక్ర‌మ ర‌వాణాను అరిక‌ట్టేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు ఎంత‌లా ప్ర‌య‌త్నిస్తున్నా స‌రే అక్ర‌మార్కులు రోజుకో కొత్త ప్లాన్ల‌తో త‌ర‌లిస్తున్నారు.ఎవ‌రి ఊహ‌కు కూడా అంద‌ని విధంగా వారు త‌ర‌లిస్తుండ‌టంతో ఏం చేయాలో పోలీసుల‌కు కూడా అర్థం కావ‌ట్లేదు.

ఇక ఇలా కాద‌ని నిత్యం బార్డ‌ర్ల ద‌గ్గ‌ర కాప‌లా కాస్తూనే ఉన్నారు ఏపీ పోలీసులు.

అయినా స‌రే అక్ర‌మార్కులు మాత్రం రోజుకో విధంగా త‌ర‌లించేందుకు ప్లాను చేస్తున్నారు.

మొన్న‌టికి మొన్న పుచ్చ‌కాయ‌ల్లో గంజాయిని త‌ర‌లించిన ఘ‌ట‌న చూశాం.అలాగే సోర‌కాయ‌లు, లేదంటే టెంకాయ‌ల్లో కూడా ప్లాన్లు చేసుకుంటూ త‌ర‌లిస్తున్నారు చాలామంది అక్ర‌మార్కులు.

అయితే ఇప్పుడు కూడా కొంద‌రు అక్ర‌మార్కులు చేసిన ఘ‌ట‌న అంద‌రినీ షాక్ చేస్తోంది.తాజాగా ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌నంగా మారింది.

ఈ జిల్లాలో గంజాయి అక్ర‌మ ర‌వాణాను అరిక‌ట్టేందుకు పోలీసులు నిత్యం ప‌హారా కాస్తూనే ఉన్నారు.

Telugu Andhra Pradesh, Ganjai, Marijuana, Sanna Peta, Srikakulam-Latest News - T

ఈ క్ర‌మంలోనే వారికి నరసన్నపేట సమీపంలో ఉండే జమ్ము జంక్షన్ ద‌గ్గ‌ర అనుమానంతో త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు.అయితే అక్క‌డ ఆగి ఉన్న ఓ కారుపై పోలీసుల‌కు అనుమానం వ‌చ్చింది.పోలీసుల‌ను చూసిన నిందితులు కారును దిగి దాన్ని అక్క‌డే వ‌దిలి వెళ్లిపోయారు.

రోడ్డు పక్కగా అనుమానాస్ప‌దంగా నిలిపి ఉంచిన కారును చూసిన పోలీసులు చెక్ ఏయ‌గా పెద్ద ఎత్తున గంజాయి క‌ట్ట‌లు దొరికాయి.దాన్ని చూసిన పోలీసులు ఇంత పెద్ద మొత్తంలో జిల్లాలోకి ఎలా వ‌చ్చార‌నే దానిపై ఆరా తీస్తున్నారు.

బార్డ‌ర్ల ద‌గ్గ‌ర మ‌రింత క‌ట్టుదిట్టంగా వ్య‌వ‌హ‌రించాలంటూ వారు డిసైడ్ అయిపోయారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube