ముంచుకొస్తున్న మూడో ముప్పు ? ఏ రేంజ్ లో అంటే ? 

గత ఏడాది మొదటి దశ కరోనా విలయ తాండవం ను అందరూ చూశారు.అప్పట్లోనూ పెద్ద ఎత్తున మరణాలు చోటుచేసుకున్నాయి.

 The Third Stage Is Concern Across The Country Due To The Corona Virus , Bharath,-TeluguStop.com

పరిస్థితి చేయి దాటి పోతుండడంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు.ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా కనిపించింది.

అమెరికా వంటి అగ్ర రాజ్యాలు ఈ వైరస్ ప్రభావానికి గజ గజలాడాయి.ఇక ఆ తర్వాత ఈ వైరస్ ప్రభావం బాగా తగ్గుముఖం పట్టడంతో,  ఇక ఏ భయము లేదని అంతా అభిప్రాయపడ్డారు.

కానీ మళ్లీ ఈ కరోనా రెండో దశ విలయతాండవం చేస్తోంది.గతంతో పోలిస్తే ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.

యువకులు,  వృద్ధులు అనే తేడా లేకుండా బలి తీసుకుంటోంది.పెద్ద ఎత్తున గతం కంటే ఎక్కువగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

దీనికి తోడు ఆక్సిజన్ కొరత తో పాటు , వ్యాక్సినేషన్ ప్రక్రియ వంటివి ఇబ్బంది కరంగా మారాయి.

ఈ రెండో దశ మహమ్మారి పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని అంత టెన్షన్ గా ఎదురుచస్తున్న సమయంలోనే మూడో దశ కూడా మొదలయ్యే అవకాశం కనిపించడం మరింత ఆందోళన రేపుతోంది.

దాదాపు ఈ మే నెల ఆఖరుకు సెకండ్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.మరీ ముఖ్యంగా పది రాష్ట్రాల్లో ఇది తీవ్రంగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

ఉత్తర ప్రదేశ్,  మహారాష్ట్ర, ఢిల్లీ ,కర్ణాటక ,కేరళ ,చత్తీస్ ఘడ్,  పశ్చిమ బెంగాల్, తమిళనాడు ,రాజస్థాన్ గుజరాత్ లలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.  ఈ రాష్ట్రాల్లో చాలావరకు లాక్ డౌన్ విధించారు.

మరికొన్ని చోట్ల రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.ఇక ఇప్పుడు మూడో దశ ముప్పును ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోకపోతే, మూడో దశ ముప్పు కారణంగా ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.
  ఈ మూడో దశ కరోనా తో పాటు,  బ్లాక్ ఫంగస్ అనే మరో వైరస్ ముప్పు పొంచి ఉండడం ఇలా ఎన్నెన్నో ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్నాయి.

Telugu Bharath, Black Fungus, Carona, Carona Wave, Central, India, Lock, Modhi,

ఇప్పటికే వివిధ రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.దేశవ్యాప్తంగా ఈ లాక్ డౌన్ ను విధించాలనే డిమాండ్ పెరిగి పోతున్నాయి.ఇప్పటికే మూడో దశ కరోనా విజృంభణ పై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి హెచ్చరికలు వచ్చాయి.

అన్ని రాష్ట్రాలు తగినంత స్థాయిలో ఆక్సిజన్ ఉత్పత్తి పెంచుకోవడంతో పాటు,  ఆస్పత్రిలలో బెడ్స్ సామర్థ్యాన్ని పెంచుకుని మూడో దశ కరోనా ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అనే అనేక  జాగ్రత్త లతో కూడిన హెచ్చరికలు  జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube