మూడవ రోజు కొనసాగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..

      శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఇవాళ ఉదయం శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో సింహ వాహనంపై మలయప్పస్వామి దర్శనమిచ్చారు.ఆల‌యంలోని ధ్వ‌జ‌స్తంభం వ‌ర‌కు స్వామివారిని సింహ‌ వాహ‌నంపై ఏకాంతంగా ఊరేగించారు.

 The Third Day Of The Brahmotsavam Of Srivari Salakat , Srivari , Brahmotsavam ,-TeluguStop.com

శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు.సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం.

ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం‘ అతి ముఖ్యమయింది.

 The Third Day Of The Brahmotsavam Of Srivari Salakat , Srivari , Brahmotsavam ,-TeluguStop.com

సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి.

సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది.అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.

Video : The Third Day Of The Brahmotsavam Of Srivari Salakat , Srivari , Brahmotsavam , Srivari Salakat , Third Day , Simhasanam , Simha Vahanam , Lion Prowess, Ourage

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube