సైకిల్ ఎత్తుకెళ్లాల‌నుకున్న దొంగ‌.. ఇంత‌లో షాకింగ్ ట్విస్టు

బ‌త‌క‌డానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.ఏదైనా ప‌ని చేసుకుని బ‌త‌కొచ్చు.

 The Thief Who Wanted To Ride A Bicycle  Meanwhile A Shocking Twist, Bicycle, Cra-TeluguStop.com

కానీ దొంగ‌లు మాత్రం అలా కాకుండా సులువుగా ఎద‌గాల‌ని కోరుకుంటారు.ఇందుకోసం అనేక ర‌కాలుగా అడ్డ‌దారులు తొక్కుతున్నారు.

ఇక దొంగతం చేసేందుకు వారు ప‌డే పాట్లు అన్నీ ఇన్నీ కావు.ఒక‌ప్ప‌టి కంటే ఇప్పుడు ప్ర‌తి చోటా సీసీ కెమెరాలు ఉండ‌టంతో వారు ఈజీగానే దొరికేస్తున్నారు.

అయినా స‌రే వారు ఇలాటి ప‌నులు మాత్రం ఆప‌ట్లేదు.అడ్డంగా దొరికిపోతున్నా కూడా త‌మ వ్య‌వ‌హారాన్ని మార్చుకోవ‌ట్లేదు.

ఇప్పుడు కూడా ఇలాగే చేసి దొరికిపోయిన వ్య‌క్తి గురించి తెలుసుకుందాం.

అయితే ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే వ్య‌క్తికి ఇదే మొద‌టి దొంగ‌త‌న‌మో లేదంటే నిర్ల‌క్ష్యంగా దొంగ‌త‌నానికి వ‌చ్చాడో తెలియ‌దు గానీ ఈజీగానే దొరికిపోయాడు.

అది కూడా పెద్ద వెహిక‌ల్స్‌ను ఎత్తుకెళ్ల‌కుండా సైకిల్ అయితే ఈజీగా ఎత్తుకెళ్లొచ్చు అనుకున్నాడు.కానీ క‌థ అడ్డం తిరిగే స‌రికి దిమ్మ తిరిగిపోయింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అయిపోతోంది.ఈ వీడియోలో చూస్తే ఓ దొంగ ఇంటి గేట్ లోప‌ల‌కు వెళ్లి అందులో ఉన్న సైకిల్ మీద క‌న్నేశాడు.

ఇంట్లో వాళ్లు ఉన్నారా లేదా అని గమనించాడు.

ఇక ఎవ‌రూ చూడ‌ట్లేద‌ని నిర్దారించుకుని సైకిల్‏ను మెల్లిగా తీసుకుని వెళ్లిపోతున్నాడు.ఇక దొంగ అలికిడికి ఇంటి ఓనర్ బ‌య‌ట‌కు వ‌చ్చి వెంబ‌డించాడు.ఇక ఓన‌ర్ ను చూసిన ఆ దొంగ సైకిల్‌ను అక్క‌డే వ‌దిలేసి పారిపోకుండా సైకిల్ తోనే ప‌రుగెత్త‌డం స్టార్ట్ చేశాడు.

కానీ సైకిల్ తో ఫాస్ట్ గా ప‌రిగెత్త‌డం కుద‌ర‌క‌పోవ‌డంతో చివ‌ర‌కు ఓనర్ చేతికి చిక్కాడు.ఇంకేముంది ఆ దొంగ‌ను ఓనర్ చిత‌క్కొట్టేశాడు.ఇక త‌న సైకిల్ త‌ను తెచ్చేసుకున్నాడు.ఇదంతా కూడా అక్క‌డే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ కావ‌డంతో దీన్ని నెట్టంట షేర్ చేశారు.

ఇంకేముంది నెటిజ‌న్లు ఆటాడేసుకుంటున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube