15కిలోల బంగారాన్ని అక్క‌డ దాచి పెట్టిన దొంగ‌.. ఇదేం తెలివిరా బాబు..

ఏమో అనుకుంటాం గానీ కొన్ని సార్లు దొంగ‌ల తెలివిని చూస్తే మ‌తిపోవాల్సిందే అన్న‌ట్టు ఉంటుంది.ఇప్ప‌టికే చాలా ఘ‌ట‌న‌ల్లో దొంగ‌లు దోచుకున్న సొత్తును త‌ర‌లించేందుకు ఎలాంటి ప్లాన్లు వేస్తున్నారో చూస్తే మ‌న కండ్ల‌ను మ‌న‌మే న‌మ్మ‌లేకుండా పోతున్నాం.

 The Thief Who Hid 15 Kg Of Gold There This Is So Clever Details, Gold Theft, Vir-TeluguStop.com

మొన్న‌టికి మొన్న ఓ దొంగ తాను దోచుకున్న సొమ్మును చెప్పుల్లో పెట్ట‌డం కూడా చూశాం.అంతకు ముందు పుచ్చ‌కాయ‌ల్లో పెట్టి త‌ర‌లించ‌డం కూడా చాలా వైర‌ల్ అయిపోయింది.

అయితే ఇప్పుడు కూడా ఓ దొంగ సొమ్మును ఎక్క‌డ పెట్టాడో తెలిస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి.

తమిళనాడులోని వెల్లూరులో రీసెంట్ గా జ‌రిగిన ఘ‌ట‌న తెలిస్తే ఎవ‌రూ న‌మ్మ‌లేకుండా పోతున్నారు.

ఈ ప్రాంతానికి చెందిన ఓ ఆభరణాల షాపులో దొంగ‌త‌నం చేసేందుకు అనైకట్ ఏరియాకు చెందిన ఓ దొంగ రెడీ అయిపోయాడు.అయితే ముసుగు వేసుకుని షాపులోకి ఎంట్రీ ఇచ్చిన ఆ దొంగ దాదాపు 15 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లాడు.

కాగా దీన్ని ఎవ‌రికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఏకంగా శ్మ‌శానంలో దాచిపెట్టాడు.ఇక ఈ కేసును న‌మోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలించి దొంగ‌ను ప‌ట్టుకున్నారు.

నాలుగు బృందాలుగా ఏర్పడి మ‌రి ఆ దొంగ‌ను అదుపులోకి తీసుకున్నారు.

Telugu Kilos Gold, Burial Ground, Cctv Footage, Gold Theft, Jewels Theft, Tamil

కాగా విచార‌ణ‌లో వారికి విస్తుపోయే నిజాలు చెప్పాడు ఆ దొంగ‌.వెల్లూరు సిటీకి దాదాపు 40 కి.మీ.ల‌లో ఉన్న‌టువంటి ఒడుకత్తూరు శ్మశానవాటికలో దొంగిలించిన బంగారాన్ని మొత్తం ఎవరికీ అనుమానం రాకుండా పాతి పెట్టాన‌ని ఒప్పుకున్నాడు.దీంతో అక్క‌డ‌కు వెళ్లిన పోలీసులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇక ఈ వివ‌రాల‌ను స్థానిక పోలీసులు వెల్లడించారు.ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ చెక్క‌ర్లు కొడుతోంది.

ఇదేం తెలివిరా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇంకొంద‌రు అయితే అత‌ని తెలివికి హ్యాట్సాఫ్ అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube