సంక్రాంతి సినిమాల థియేటర్ల లొల్లి మరీ పీక్స్‌కు చేరింది... దిల్‌ రాజు సంచలన కామెంట్స్‌     2019-01-08   10:13:10  IST  Ramesh Palla

ప్రతి సంక్రాంతి మాధిరిగానే ఈ సంక్రాంతికి కూడా పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కాబోతున్నాయి. ప్రతి సారి మాదిరిగానే ఈ సారి కూడా సినిమాలకు థియేటర్ల సమస్య ఏర్పడినది. రేపటి నుండి మొదలు పెట్టి వరుసగా నాలుగు రోజుల పాటు నాలుగు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద క్యూ కట్టబోతున్నాయి. ‘ఎన్టీఆర్‌’, ‘వినయ విధేయ రామ’ మరియు ‘ఎఫ్‌ 2’ చిత్రాలకు భారీగానే థియేటర్లు దొరికాయి.

కాని సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ మూవీకి మాత్రం ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకడం లేదు. దాంతో పేట మూవీ నిర్మాతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.వినయ విధేయ రామ మరియు ఎఫ్‌ 2 చిత్రాల కోసం నిర్మాతలు అల్లు అరవింద్‌ మరియు దిల్‌రాజులు థియేటర్లన్ని బుక్‌ చేశారు. ఇతర ఏ సినిమాలకు కూడా థియేటర్లు లేకుండా చేస్తున్నారు.

రజినీకాంత్‌ మూవీ అనే గౌరవం కూడా లేకుండా మా సినిమాకు థియేటర్లు ఇవ్వడం లేదు అంటూ పేట నిర్మాత వల్లభనేని అశోక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్‌ చేశాడు. ఈ నేపథ్యంలో మెగా కాంపౌండ్‌ నుండి బన్నీ వాసు మరియు శ్రీను మరియు దిల్‌రాజులు ఘాటుగా స్పందించారు.

The Theaters Issue For Sankranthi Releasing Movies-F2 Movie Release Date Petta Sankranthi Movies Vvr

The Theaters Issue For Sankranthi Releasing Movies


దిల్‌రాజు మాట్లాడుతూ మా సినిమాలకు ఆరు నెలల ముందే డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నాం. మూడు సినిమాలకే థియేటర్ల సమస్య ఏర్పడినది. 20 రోజుల క్రితం విడుదల తేదీ ఫిక్స్‌ చేసుకుని రంగంలోకి దిగుతే థియేటర్లు లభిస్తాయా అంటూ దిల్‌రాజు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమద్య వచ్చిన సర్కార్‌ చిత్రం అత్యధిక థియేటర్లలో విడుదల అయ్యింది. ఆ సమయంలో థియేటర్లు ఖాళీ ఉన్నాయి కనుక లభించాయి.

The Theaters Issue For Sankranthi Releasing Movies-F2 Movie Release Date Petta Sankranthi Movies Vvr

ఇప్పుడు థియేటర్లు లేవు అంటే ఎలా అంటూ దిల్‌రాజు రిటర్న్‌ ఎటాక్‌ ఇచ్చాడు. పేట మూవీకి కనీసం రెండువందల యాబై థియేటర్లు అయినా దొరికే పరిస్థితి లేదు. అందుకే తెలుగు నిర్మాత అశోక్‌ అలా ఆరోపణలు చేస్తున్నాడు. ఈ థియేటర్ల లొల్లి ఇంకెంత దూరం వెళ్తుందో అంటూ సినీ వర్గాల వారు టెన్షన్‌ పడుతున్నారు.

The Theaters Issue For Sankranthi Releasing Movies-F2 Movie Release Date Petta Sankranthi Movies Vvr