ఆ గుడి ఏడాదికి కేవలం 5 గంటలే తెరుస్తారట.. ఎక్కడో తెలుసా..?!

మామూలుగా గుడి అంటే చాలా మంది దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు.తెల్లవారు జామున 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ దేవుడ్ని భక్తులు దర్శించుకుంటూ ఉంటారు.

 The Temple Is Open Only For 5 Hours A Year Do You Know Somewhere-TeluguStop.com

మనదేశంలో దేవాలయాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి.ప్రతి ఒక్క ఆలయానికి కూడా ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది.

పురాణాలు, శాస్త్రాల ప్రకారంగా కొన్ని గుడుల్లో దేవుడు స్వయంగా వెలశాడు.ఇంకొన్ని ఆలయాల్లో దేవుడు కోరింది కోరుకున్నట్టుగా వరాల జల్లు కురిపిస్తాడు.

 The Temple Is Open Only For 5 Hours A Year Do You Know Somewhere-ఆ గుడి ఏడాదికి కేవలం 5 గంటలే తెరుస్తారట.. ఎక్కడో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే కోట్ల మంది ప్రజలు గుడికి వెళ్లి తమ తమ మొక్కులను చెల్లించుకుంటారు.భారతదేశంలో అనేక దేవాలయాలు అనేవి ఉన్నాయి.

కొన్ని దేవాలయాలు సంవత్సరాల తరబడి ఉంటే మరికొన్ని గుడులు కేవలం రెండు నెలలు లేదా ఒక్కో నెలా ఉండటం జరుగుతోంది.చార్ ధామ్ , శబరిమలై వంటి దేవాలయాలు రెండు నెలలు తెరుచుకుని ఉంటాయి.

అయితే ఇక్కడో ఆలయం ఏడాదికి కేవలం ఐదు గంటలు మాత్రమే తెరుచుకుని ఉంటుంది.

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాకు 12 కిలోమీటర్ల దూరంలో ఓ ఆలయం ఉంది.

ఈ ఆలయం ఓ కొండపై ఉంది.నీరయ్ మాతా దేవాలయంగా ఆ గుడి ఎంతో ప్రసిద్ది చెందింది.

ఈ గుడి ఏడాదిలో చైత్ర నవరాత్రి పర్వదినం ఉదయాన్నే 4 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే తెరుచుకుని ఉంటుంది.అంటే ఆ గుడి ఐదు గంటలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కల్పించనుంది.

Telugu 5 Hours, Opened, Social Media, Temple Open, Viral Latest, Viral News-Latest News - Telugu

అందుకే ఆ ఐదు రోజులూ కొన్నివేల మంది ఆ దేవాలయానికి తరలి వస్తారు.ఈ ఆలయంలో కేవలం కొబ్బరికాయ కొట్టి, అగరవత్తులు వెలిగిస్తే చాలు.ఇంకో విషయం ఏంటంటే ఈ ఆలయానికి ఆడవాళ్లకు అనుమతి ఉండదు.ఈ దేవాలయం ప్రసాదం ఆడవాళ్లు తిన్నట్లైతే వారికి పాపం తగులుతుందని నమ్మకం.చైత్ర నవరాత్రి టైంలో దీపం దానంతట అదే వెలుగుతుంది.అయితే దానికి సంబంధించిన రహస్యం ఇంకా బయటపడలేదు.

#Hours #Temple

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు