ఆ టీవీ ఛానెల్ బాధ ఏంటి..? ఆ సర్వేపై ఇప్పుడు వెనకడుగు ఎందుకు ..?  

సర్వేలు ! తెలంగాణలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది.. ఎన్ని ఎన్ని సీట్లు గెలవబోతోంది..? అంటూ వివిధ సంస్థలు రకరకాల సర్వేలు పేరుతో కొంతకాలంగా హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏ ఒక్క సర్వే కూడా ఒక విధంగా లేదు. కొన్ని సంస్థలు టిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని చెబుతుండగా ..లేదు లేదు తెలంగాణలో ప్రజా కూటమి అధికారంలోకి వస్తుందని మరికొన్ని సర్వే సంస్థలు తేల్చేస్తున్నాయి. మరికొన్ని సర్వేలు తెలంగాణలో హంగ్ ఏర్పడబోతుందని ఇలా ఎవరికి వారు సర్వే రిపోర్టులు బయట పెడుతూ తెలంగాణలో పొలిటికల్ హిట్ పెంచుతున్నారు.

The Telugu News Channel Shows Deep Involvement In CPC Surrey-Kcr Mahakutami Prajakutami Trs Tv9 Cpc Survey On Telangana Elections Winning Party

The Telugu News Channel Shows Deep Involvement In CPC Surrey

అయితే.. ఈహడావుడి ఇలా ఉండగానే మేమేమైనా తక్కువ తిన్నామా అంటూ .. తెలుగు న్యూస్ ఛానల్ లో నే అగ్రగామిగా ఉన్న ఓ ప్రముఖ ఛానల్ కూడా తమ సర్వే రిపోర్ట్ ను బయటకు తీసింది. అయితే కొద్దిరోజుల క్రితమే ఈ ఛానల్ టీఆర్ఎస్ పార్టీకి మద్దతుదారుడిగా ఉండే ఓ వ్యక్తి కొనుగోలు చేయడంతో ఇప్పుడు టీవీ ఛానల్ ఆ పార్టీకి అనుకూలంగా ప్రజల నాడి ఉంది అంటూ సర్వేలు చూపిస్తోంది. ఏకంగా తెలంగాణ లో టీఆర్ఎస్ కి 104 సీట్లు వస్తాయని ప్రజా కూటమికి 16 సీట్లు వస్తాయని టీవీ సంస్థ అత్యుత్సాహంతో ప్రకటించింది. కానీ తాజాగా వచ్చిన లగడపాటి సర్వే లు గానీ జనం నాడి గానీ అంచనా వేస్తుంటే… తెలంగాణలో టిఆర్ఎస్ కు ఆ చానల్ చెప్పినంత స్థాయిలో అవకాశం లేదని అర్ధం అవుతోంది.

The Telugu News Channel Shows Deep Involvement In CPC Surrey-Kcr Mahakutami Prajakutami Trs Tv9 Cpc Survey On Telangana Elections Winning Party

దీనిపై సదరు టీవీ ఛానల్ లో పనిచేసే ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. అనవసరంగా వంద సీట్లు వస్తాయని వేసి పరువు పోగొట్టుకున్న అని ఎన్నికల ఫలితాల తర్వాత ఆ ప్రభావం టీవీ ఛానల్ విశ్వసనీయత మీద పడుతుందని తెగ బాధపడిపోతున్నారు. కనీసం 70 80 సీట్లు వస్తాయి జనం నమ్మడానికి అయినా తమ పరువు కొంచమైనా మిగలడానికి అయినా అవకాశం ఉండేదని… కానీ మితిమీరి వందకుపైనే సీట్లు వస్తాయని చెప్పడం మరీ అత్యాశే అవుతుంది అని.. ఇవన్నీ జనాల్లో తమ ఛానెల్ నవ్వులపాలవ్వడానికి కారణం అవుతామని ఆ సంస్థ ఉద్యోగులు వాపోతున్నారు.