టీడీపీ ఎంపీలు జంపేనా ? అసలేం జరుగుతోంది ?

తెలుగుదేశం పార్టీ నుంచి అధికార పార్టీ వైసీపీ లోకి చేరికలు మొదలయ్యాయి.ఒక్కో ఎమ్మెల్యే వైసీపీకి జై కొడుతూ, పార్టీలో నేరుగా చేరకుండా, అనర్హత వేటు నుంచి తప్పించుకునే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

 Three Tdp Mp's Want To Jump In Ysrcp Party  The Telugu Desam Party Is In Doubt A-TeluguStop.com

ఇప్పటికే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల్లో ముగ్గురు టీడీపీని వీడబోతున్నారు.ఇప్పటికే ఒకరు జగన్ కు జై కొట్టగా, మరో ఇద్దరు ఆ బాటలో వెళ్ళబోతున్నారు.

ఇలా వరుసగా జరుగుతున్న పరిణామాలు టీడీపీలో ఆందోళన మరింతగా పెంచుతున్నాయి.వరుసగా ఎమ్మెల్యేలంతా, పార్టీని వీడితే ప్రధాన ప్రతిపక్ష హోదా పోతుందేమోనన్న భయం ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబును వెంటాడుతోంది.

వలసలకు బ్రేక్ వేసే విధంగా నిత్యం జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా జూమ్ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ, పార్టీ నేతలకు భరోసా ఇచ్చే విధంగా, భవిష్యత్తు కు ఎటువంటి ఢోకా ఉండదు అనే విధంగా చంద్రబాబు పదే పదే చెబుతున్నా, ఆ పార్టీ నేతల్లో నమ్మకం కలగడం లేదు.

ఏ క్షణం ఎవరు పార్టీని వీడుతారో తెలియని టెన్షన్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నెలకొంది.

ఈ టెన్షన్ ఇలా ఉండగానే, ఇప్పుడు పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీల వైఖరిలోను స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పార్టీ తీరుపై అసంతృప్తితో ఉండడం, వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఎమ్మెల్యే లే కాకుండా ఎంపీలు కూడా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారా అనే అనుమానం ఇప్పుడు అందరిలోనూ మొదలైంది.దీనికి తగ్గట్టుగానే వారి వ్యవహారాలు ఉండడం, ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు ఈ ముగ్గురు వ్యవహారాలపై ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కు అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Telugu @tdptelangana, Ayynnapathrudu, Chandrababu, Ganababu, Ganesh, Jagan, Vasu

తాజాగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తల్లి మాజీ మంత్రి అయిన గల్లా అరుణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలి పదవికి రాజీనామా చేయడంతో, ఇప్పుడు టీడీపీలో కలకలం రేగుతోంది.గల్లా జయదేవ్ ఆమె తల్లి అరుణ ఇద్దరూ చర్చించుకున్న తర్వాతే ఆమె ఆ పదవికి రాజీనామా చేసి ఉంటారని, ఇప్పుడు గల్లా జయదేవ్ పార్టీని వీడుతారా అనే అనుమానాలు టీడీపీలో పెరిగిపోతున్నాయి.అలాగే విజయవాడ ఎంపీ కేశినేని నాని సైతం అసంతృప్తిగా ఉన్నట్లు గానే కనిపిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఆయన పోస్టింగ్ చూస్తే ఈ విషయం అర్థం అవుతోంది.ఇక శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు చాలా కాలంగా సైలెంట్ గా ఉంటున్నారు.

పార్టీ కార్యక్రమాల్లో పెద్ద యాక్టివ్ గా ఉన్నట్టు కనిపించడం లేదు.

రామ్మోహన్ నాయుడుకి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉండటం, ప్రధాని నరేంద్ర మోదీ సైతం రామ్మోహన్ నాయుడు ప్రసంగాలకు ఫిదా అవుతుండడం వంటి కారణాలతో ఆయనకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది.

ఇప్పుడు ఆయన పైన టీడీపీ అనుమానంగానే చూస్తోంది.ఇలా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా అందరిపైనా టీడీపీ లో అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube