తెలుగు అకాడెమీని తెలుగు సంస్కృత అకాడెమీగా పేరు మార్చింది ఏపీ ప్రభుత్వం. తెలుగు అకాడెమీ పేరు మార్చడంపై విమర్శలు తలెత్తుతున్నాయి.
ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలుగు అకాడెమీ పేరు మార్చడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.తెలుగు అకాడెమీ పేరు మార్చడం వల్ల ప్రయోగజనం ఏంటని ప్రశ్నించారు జనసేనాని.
వీలైతే సంస్కృతి భాషాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఓ అకాడెమీ ఏర్పాటు చేయాలని అన్నారు.తెలుగు భాష అభివృద్ధి కోసం.
విద్యా విషయకంగా తెలుగు బహష వినియోగం కోసం కృషి చేయాల్సిన అకాడెమీ అస్తిత్వాన్నే దూరం చేసేలా పేరు మార్చడం ఏమాత్రం సభబు కాదని ప్రభుత్వాన్ని విమర్శించారు పవన్ కళ్యాణ్.
తెలుగు అకాడెమీని తెలుగు సంస్కృతి అకాడెమీగా ఇప్పటికిప్పుడు ఎందుకు మార్చాల్సి వచ్చిందో ప్రభుత్వంతోపాటుగా అకాడెమీ పెద్దలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్.
పేరు మార్చడం ద్వారా మీరు ఏం సాధించారని ప్రభుత్వాన్ని నిలదీశారు.పవన్ కళ్యాణ్ తో పాటుగా తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ కూడా ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు.

తెలుగు అకాడెమీ పేరు మార్చడం విచారకరమని ఆయన అన్నారు.తెలుగు అకాడెమీలో సంస్కృతం కలపడం కూడా భావ్యం కాదని అన్నారు బుద్ధప్రసాద్.సీఎం జగన్ తెలుగు అకాడెమీ చరిత్ర గురించి తెలుసుకోవాలని చెప్పారు.మాతృభాషని గౌరవించడం ప్రభుత్వాల ప్రధమ కర్తవ్యమని.తెలుగు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని అన్నారు.