బంగారం విరాళంగా ప్ర‌క‌టించి డ‌బ్బులు మాత్ర‌మే ఇవ్వాలంటున్న తెలంగాణ ప్ర‌భుత్వం..

The Telangana Government Has Announced That It Will Donate Gold And Give Only Money

తెలంగాణలో ఇప్పుడు ఓ అద్భుత‌మైన ఆల‌యం గురించి చ‌ర్చ సాగుతోంది.ఎప్పుడెప్పుడా అని వేయి కండ్ల‌తో తెలంగాణ ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్న ఆ ఆల‌యం పూర్తి కావ‌చ్చింది.

 The Telangana Government Has Announced That It Will Donate Gold And Give Only Money-TeluguStop.com

ఇప్ప‌టికే మ‌నం దేని గురించి చ‌ర్చించుకుంటున్నామో మీకు అర్థ‌మ‌యే ఉంటుంది.అదేనండి యాదాద్రి ఆల‌యం గురించి.

ఈ ఆల‌యాన్ని సీఎం కేసీఆర్ ఎంతో జాగ్ర‌త్త‌గా నిర్మిస్తున్న సంగ‌తి తెల‌సిందే.గుడిని పునఃప్రారంభం కూడా ఈ ఎండాకాలంలోనే ఉండే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది.

 The Telangana Government Has Announced That It Will Donate Gold And Give Only Money-బంగారం విరాళంగా ప్ర‌క‌టించి డ‌బ్బులు మాత్ర‌మే ఇవ్వాలంటున్న తెలంగాణ ప్ర‌భుత్వం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే మొన్న గుడిని మ‌రోసారి ప‌ర్య‌వేక్షించిన సీఎం కేసీఆర్ ఆలయ విమాన గోపుర నిర్మాణం కోసం ఓ నిర్ణ‌యం తీసుకున్నారు.

అదేంటంటే తిరుమలలోని తిరుప‌తి దేవ స్థానం గుడి లాగానే యాదాద్రిలో కూడా స్వర్ణ తాపడం చేయించేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు.

అయితే ఇది నిర్మించాలంటే బంగారు తాపడానికి క‌నీసం 125 కేజీల బంగారం కావాల్సి ఉంటుంది.మ‌రి అంత బంగారాన్ని సేక‌రించాలంటే కేవ‌లం ప్ర‌భుత్వంతో అయితే ఇబ్బంది అవుతుంద‌ని భావించిన కేసీఆర్ ఈ పుణ్య కార్యంలో ప్ర‌జ‌ల స‌హ‌కారం తీసుకోవాల‌ని భావించారు.

ఇందుకోసం బంగారాన్ని విరాళం ఇవ్వాలంటూ కోరుతున్నారు.పైగా త‌న కుటుంబం తరఫున కూడా కేజీ పదహారు తులాల వ‌ర‌కు ఇస్తామంటూ చెప్పేశారు.

Telugu 125 Kg Of Gold, Cm Kcr, Gold, Kcr Government, Money, Telangana Government, Yadadri Temple, Yadadri Temple Donations-Latest News - Telugu

అయితే ఇలా బంగారాన్ని విరాళం కోరే స‌మ‌యంలో కేసీఆర్ ప్ర‌భుత్వం ఇప్పుడు ఓ వినూత్న సూచన చేసింది.అదేంటంటే గోపురానికి ఎవరైతే బంగారం ఇవ్వాల‌ని అనుకుంటున్నారో వారంతా కూడా కేజీల చొప్పున విరాళంగా ప్ర‌క‌టించి అందుకు స‌రిస‌మాన‌మైన డ‌బ్బుల‌ను మాత్రం బ్యాంకు ఖాతాలో జ‌మ చేయాలంటున్నారు.ఇలా ఎందుకు అంటే ప్ర‌జ‌లు బంగారాన్ని ఇస్తే అందులో పూర్తిగా నాణ్యత ఉండే అవ‌కాశం ఉండ‌ద‌ని కాబ‌ట్టి డ‌బ్బులు ఇస్తే తామే వారి పేరు మీద స్వచ్ఛమైన బంగారాన్ని కొంటామ‌ని అధికారులు చెబుతున్నారు.ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్‌గా మారిపోయింది.

#KCR #Yadadri Temple #Telangana #CM KCR #Money

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube