కళ్ళు లేవు కానీ 50 కోట్ల టర్నోవర్ కంపెనీకి సీఈఓ అయ్యాడు , శ్రీకాంత్ బొల్లా కథ వింటే కన్నీళ్లు ఆగవు..  

The Tearful Story Of Blind Person Srikanth Bolla-srikanth Bolla Life Style,srikanth Bolla Real Story,telugu Viral News,viral In Social Media

కాళ్ళు చేతులు అన్ని బాగా ఉన్న చాలా మంది సంపాదన లేక ఏం చేయాలో తెలియక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కానీ కళ్ళు లేకున్నా 50 కోట్ల టర్నోవర్ కంపెనీకి సీఈఓ గా ఎదిగాడు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్రీకాంత్ బొల్లా. అంగవైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా ఎన్నో అవమానాలు పడి కష్టపడి చదివి అందరికి ఆదర్శంగా నిలిచాడు...

కళ్ళు లేవు కానీ 50 కోట్ల టర్నోవర్ కంపెనీకి సీఈఓ అయ్యాడు , శ్రీకాంత్ బొల్లా కథ వింటే కన్నీళ్లు ఆగవు..-The Tearful Story Of Blind Person Srikanth Bolla

శ్రీకాంత బొల్లా కథ

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఒక్క చిన్న పల్లెటూరులో పుట్టిన శ్రీకాంత పుట్టుకతోనే అంధుడు.అతనికి కళ్ళు కనిపించవు అని బంధువులు , చుట్టుపక్కల వాళ్ళందరూ అతనిని ఎక్లాడైన ఆశ్రమం లో చేర్పించమన్నారు. కానీ నెలకి 2000 రూపాయలు కూడా సంపాదించలేని శ్రీకాంత్ తల్లిదండ్రులు తన కొడుకుకి ఏ లోటు రాకుండా ఉంచాలి అనుకున్నారు. దానితో శ్రీకాంత్ ని దగ్గరిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పంపించారు , అక్కడ ఉన్న పిల్లలే కాదు టీచర్లు కూడా అతనిని గేలి చేశారు ,అతని వైకల్యం చూసి జలిపడటం మాని అతనిని వెక్కిరించడం చేశారు. శ్రీకాంత్ కి ఎలాగైనా చదువుకోవలన్న తపన ఎక్కువైంది , దానితో శ్రీకాంత్ తండ్రి దగ్గరలో ఉన్న అంధుల పాఠశాలలో చేర్పించారు..

చదువులో శ్రీకాంత్ ప్రతిభ

అంధుల పాఠశాలలో చేరిన శ్రీకాంత పదవ తరగతి మరియు ఇంటర్ లలో 90 శాతం పైగా మార్కులు సాధించాడు. చదువుతో పాటు చెస్ , ఇతర క్రీడలలో కూడా ఛాంపియన్ గా నిలిచాడు. ఇంటర్ పూర్తి అయ్యాక ఐఐటీ లో ఇంజినీరింగ్ చేయాలని ఎంట్రన్స్ పరీక్ష కి దరఖాస్తు పెట్టుకోగా ఏ కాలేజ్ కూడా తాను అంధుడని హాల్ టికెట్ కూడా పంపలేదు. కానీ తన ప్రతిభతో లీడ్ ఇండియా ప్రాజెక్టు లో చోటు లభించింది.

మాజీ రాష్ట్రపతి దిగవంత అబ్దుల్ కలామ్ గారు చేపట్టిన లీడ్ ఇండియా ప్రాజెక్ట్ లో మరింత చదువుకునే అవకాశం లభించింది...

విదేశాల్లో ఇంజినీరింగ్

ఐఐటీ నిరాకరించిన శ్రీకాంత ఇంజినీరింగ్ అవ్వాలన్న తన కలను మాత్రం వదిలపెట్టలేదు .విదేశాల్లో యూనివర్సిటీ లకి దరఖాస్తు పెట్టుకున్నాడు.

శ్రీకాంత్ ప్రతిభ చూసి మస్సాచు సెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి లో సీటు వచ్చింది. ఆ యూనివర్సిటీ లో అడ్మిషన్ పొందిన మొదటి భారతీయుడు శ్రీకాంత్ కావడం విశేషం.

50 కోట్ల టర్నోవర్ గల సొంత కంపెనీ

విదేశాల్లో పై చదువులు పూర్తి అవ్వగానే భారత్ కి వచ్చేసి తన లాంటి అంగవైకల్యం గల వారికి ఏదైనా చేయాలనుకున్నారు.వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇచ్చే కంపెనీ ని ప్రారంభించిన శ్రీకాంత్ ఇప్పటివరకు 5000 కి పైగా శిక్షణ ఇచ్చాడు. వృత్తి విద్యా శిక్షణ ఇచ్చాను కానీ వారికి ఉపాధి ఎలా అని ఆలోచించినపుడే వారి కోసం ఒక కంపెనీ పెట్టాలనుకున్నాడు...

ఇప్పుడు ఆ కంపెనీ లో 150 కి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఆ కంపెనీ కి దాదాపు విలువ 50 కోట్ల టర్నోవర్ . అంగవైకల్యన్నీ కూడా జయించి 50 కోట్ల టర్నోవర్ కంపెనీ కి సీఈఓ అయ్యిన శ్రీకాంత్ బొల్లా అందరికి ఆదర్శం…