తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 షో ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే.ఇక బిగ్ బాస్ షో మరొకటి మొదలవ్వాలి అంటే కాస్త సమయం పడుతుంది.
కానీ ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ ని మరొక రెండు నెలల్లో అనగా ఫిబ్రవరిలో మొదలవుతుంది అని ప్రకటించారు.బిగ్ బాస్ ప్రేమికులు కూడా నాగార్జున ప్రకటించిన విధంగా బిగ్ బాస్ తెలుగు ఓటిటీ ఎప్పుడెప్పుడు ప్రసారం అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.
బుల్లితెరపై ప్రసారం అయ్యే రెగ్యులర్ బిగ్ బాస్ లాగే ఈ బిగ్ బాస్ ఓటిటీ కూడా ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్ ఇవ్వబోతోంది.
ఇక బిగ్ బాస్ తెలుగు ఓటీటీ లో మొదలవుతుంది అని తెలియగానే అందులో ఎవరెవరు ఉండబోతున్నారు? అన్న విషయం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.ఇప్పటికే ఈ షోలో పాల్గొనే ముగ్గురు కంటెస్టెంట్ ల పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా యాంకర్ శివ, యాంకర్ వర్షిని, అలాగే ఢీ 10 టైటిల్ విన్నర్ రాజు ని ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ఆ తర్వాత షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ లో నటించిన వైష్ణవి చైతన్య కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించినట్టు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం.
ఈ బిగ్ బాస్ తెలుగు ఓటిటీ కోసం మరొక కంటెస్టెంట్ ను బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించినట్లు తెలుస్తోంది.
ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదర్శ్ బాలకృష్ణ.ఆదర్శ బాలకృష్ణను బిగ్ బాస్ తెలుగు ఓటిటీ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.ఇక నటుడిగా ఆదర్శ్ బాలకృష్ణ అందరికీ సుపరిచితమే.
అతను మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు.అలా అతడు చివరికి ఫైనల్ కి చేరుకునే విన్నర్ గా శివ బాలాజీ గెలవగా ఆదర్శ్ బాలకృష్ణ రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు.
ఈ క్రమంలోనే తాజాగా అతడికి బిగ్ బాస్ నిర్వాహకులు మరో ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది.