స్కూల్లో పిల్లల ముందు కొట్టుకున్న టీచర్లు.. అసలు గొడవ ఏమిటంటే..?

స్కూల్లో టీచర్లు( Teachers ) అసభ్య పదజాలంతో దూషించుకుంటూ జుట్టు పట్టుకొని కొట్టుకోవడం, చెప్పులతో ఒకరిపై మరొకరు దాడికి పాల్పడడంతో క్లాస్ రూమ్ లో ఉండే విద్యార్థులు షాక్ అయ్యారు.పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు తరగతి గదిలో అసభ్యంగా తిట్టుకుంటూ బయటకు వచ్చి జుట్టు పట్టుకొని పిల్లల ముందు కొట్టుకున్న ఘటన బీహార్( Bihar ) రాజధాని పాట్నా లోని బిహ్త( Patna ) ప్రాంతంలో ఉండే ఓ స్కూల్లో చోటు చేసుకుంది.

 The Teachers Who Beat The Children In Front Of The School What Is The Real Fight-TeluguStop.com

ప్రస్తుతం సోషల్ మీడియాలో చేరి వైరల్ అయింది.ఆ వివరాలు ఏమిటో చూద్దాం.

Telugu Anita Kumari, Bihar, Educational, General, Kanti Kumari, Latest Telugu, P

వివరాల్లోకెళితే.బిహ్త లో స్థానికంగా ఉండే పంచాయితీ స్కూల్లో కంటి కుమారి ప్రధానోపాధ్యాయురాలికి అదే స్కూల్లో పని చేసే అనితా కుమారి ( Anita Kumari )అనే ఉపాధ్యాయులు మధ్య చిన్న మాట పెద్ద గొడవకు దారితీసింది.ప్రధానోపాధ్యాయురాలు తరగతి గది కిటికీ మూయమని ఉపాధ్యాయురాలుకి చెప్పింది.కానీ ఉపాధ్యాయురాలు అనిత కుమారి కిటికీ మూసేందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది.ఇద్దరూ ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకుంటూ బయటకు వచ్చారు.ఇంతలో మరో ఉపాధ్యాయురాలు అనిత కుమారిని సపోర్ట్ చేస్తూ ప్రధానోపాధ్యాయురాలు పై దాడికి దిగింది.

ఇక ఇద్దరు ఉపాధ్యాయురాలు చెప్పులతో, కర్రలతో ప్రధానోపాధ్యాయురాలు పై ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు.మిగిలిన ఉపాధ్యాయురాలు వచ్చి గొడవను ఆపారు.

Telugu Anita Kumari, Bihar, Educational, General, Kanti Kumari, Latest Telugu, P

ఈ గొడవను అంతా వీడియో తీయడంతో ఆ వీడియో వైరల్ అయి చివరికి మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ దృష్టికి వెళ్ళింది.ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి టీచర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మండల విద్యాధికారి తెలిపారు.ఇక ఈ వీడియో చూసిన వారంతా పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్లే ఇలా అసభ్యంగా తిట్టుకుంటూ కొట్టుకోవడం ఏంటని విమర్శిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube