కసి ఉన్నా కలిసిరావడం లేదుగా ? 

టిడిపి అధినేత చంద్రబాబు లో కానీ , ఆయన కుమారుడు లోకేష్ లో కానీ గతంతో పోలిస్తే పట్టుదల బాగా పెరిగింది.వైసీపీ ప్రభుత్వాన్ని అర్జెంటుగా గద్దె దింపి, తాము అధికారంలోకి రావాలనే ఉత్సాహం కనిపిస్తోంది.

 The Tdp Is Trying To Fight The Ycp Government But The Result Is Not Visible, Jag-TeluguStop.com

ఈ మేరకు తండ్రి కొడుకులు ఇద్దరు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.పార్టీ నాయకుల్లో నెలకొన్న నిరుత్సాహాన్ని పారద్రోలేందుకు ప్రయత్నిస్తూనే, వైసీపీ ప్రభుత్వం పై ఏదో ఒక రూపంలో పోరాటాన్ని కొనసాగిస్తూనే వస్తున్నారు.

ప్రస్తుతం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయకపోయినా, తన కుమారుడు లోకేష్ ను ముందు పెట్టి వెనుక రాజకీయ నడిపిస్తున్నారు.ఎక్కడా తగ్గేదే లేదు అన్నట్లుగా లోకేష్ సైతం ఏపీలో తన సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే  జగన్ ప్రభుత్వం పై ఈ స్థాయిలో పోరాటం చేస్తున్నా, ఆశించిన ఫలితం అయితే దక్కడం లేదనే బాధ చంద్రబాబులో ఎక్కువగా కనిపిస్తోంది.ముఖ్యంగా పార్టీ సీనియర్లు చాలామంది ఉన్నారు.
  ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో వారెవరు ముందుకు రాని పరిస్థితి ఉంది.పూర్తిగా వారు ప్రస్తుత రాజకీయాలకు పనికి రారు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు.పోనీ వారిని పూర్తిగా పక్కన పెట్టేద్దాము అంటే అది కుదరని పని అని బాబుకు బాగా తెలుసు.అందుకే ఎవరు కలిసి వచ్చినా,  రాకపోయినా పర్వాలేదు అన్నట్లుగానే లోకేష్ , చంద్రబాబు వ్యవహరిస్తున్నారు.

మరోవైపు చూస్తే జగన్ సంక్షేమ పథకాలతో జనాల్లోకి దూసుకుపోతున్నారు.ఆయనను ప్రజల నుంచి వేరు చేయడం, పరపతి తగ్గించడం చాలా కష్టమైన పని అన్నట్లుగా వ్యవహారం ఉంది.

అలా అని బిజెపి, జనసేన ను కలుపుకుని వెళ్లి ఉమ్మడిగా పోరాటాలు చేద్దామంటే బిజెపి లోనే పరిస్థితి గందరగోళంగా ఉంది.టిడిపిని పూర్తిగా వ్యతిరేకించే వారు ఒక వర్గం, సానుకూలంగా ఉండే వారు మరొక వర్గం అన్నట్లుగా పరిస్థితి ఉంది.

ఇక జనసేన సైతం టిడిపి తో ప్రస్తుతానికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది.
 

Telugu Chandrababu, Jagan, Janasena, Pavan, Somu Veerraju, Tdp, Ysrcp-Telugu Pol

దీంతో ఎవరికి వారే విడివిడిగా వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేస్తున్నారు.ఈ వ్యవహారాలు పెద్దగా కలిసి రాక పోవడంతో టిడిపి క్యాడర్ కూడా ప్రభుత్వంపై పోరాడేందుకు పెద్దగా ఉత్సాహం చూపించక పోవడం ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయి.2024 నాటికి వైసీపీ ప్రభుత్వానికి ప్రజల నుంచి మద్దతు దూరం చేసి తాము అధికారంలోకి రావాలని  టిడిపి ప్లాన్డ్ గా ఉన్నా,  ఆ ప్లాన్ అమలు చేసేందుకు మాత్రం ఉత్సాహం చూపించకపోవడం ఇబ్బందికరంగా మారింది.టీడీపీ అనుకూల మీడియా బలంగా ఉన్న,  వారు వైసీపీ ప్రభుత్వం పై ఎన్ని రకాలుగా ప్రజా వ్యతిరేకత పెరిగే విధంగా ప్రచారాలు చేస్తున్నా, జనాలు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు.ఇలా ఎన్నో పరిణామాలు టీడీపీకి నిరాశ కలిగిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube