అమెరికా వ‌దిలి వెళ్లిన విమానాల‌ను ఆ విధంగా వాడేస్తున్న తాలిబ‌న్లు..

ప్ర‌పంచం మొత్తం ఇప్పుడు మాట్లాడుకుంటున్న అంశం ఏదైనా ఉందా అంటే అది ఆఫ్ఘనిస్తాన్ అనే చెప్పాలి.ఇక్క‌డ తాలిబన్లు సాగిస్తున్న అరాచ‌కాల‌తో ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.

 The Taliban Are Using The Planes That Left The United States In That Way Taliban-TeluguStop.com

ఇక అమెరికా సైన్యం వెల్లిపోయిన త‌ర్వాత ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న సంగ‌తి అంద‌రికీ విదిత‌మే.అయితే ఇప్ప‌డు వారు అధికారంలోకి రావ‌డంతో ఆ దేశంలో పరిస్థితి అత్యంత భ‌యంక‌రంగా తయారైంది.

అక్కడ జీవిస్తున్న చాలామంది సాధారణ పౌరులు అలాగే మహిళలు కూడా తాలిబ‌న్ల కార‌ణంగా న‌ర‌కం అనుభ‌విస్తున్నారు.

అయితే ఇప్పుడు తాలిబ‌న్ల‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చెక్క‌ర్లు కొడుతోంది.

అయితే ఇది కొంచెం ఫ‌న్నీగానే ఉన్నా దాని వెన‌క ఉన్న విషాదం మాత్రం అంతులేనిద‌నే చెప్పాలి.ఇందులో ఏముందంటే తాలిబాన్లు అమెరికా సైన్యం వ‌దిలి వెళ్లిన విమానం రెక్కల‌కు ఊయలలు కట్టుకుని హాయిగా న‌వ్వుకుంటూ ఊగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

అమెరికా సైన్యం గ‌త 20 ఏండ్లుగా తాలిబన్ల మీద ఈ విమ‌నాల‌తో దాడులు జ‌రిపి ఆఫ్గ‌నిస్తాన్‌ను కాపాడారు.కానీ ఇప్పుడు అమెరకా సైనికులు యుద్ధ విమానాలను ప‌నికి రాకుండా చేసి ఇక్క‌డే వ‌దిలి వెల్లిపోయారు.

దీంతో ఈ యుద్ధ విమ‌నాల‌ను కాస్తా తాలిబాన్లు పూర్తిగా వినియోగించుకుంటున్నారు.కాగా ఈ వీడియోపై ఎన్నీ ఫ‌న్నీ కామెంట్లు వ‌స్తున్నాయో అంతే దుమారం రేగుతోంది.అమెరికాపై చాలామంది విమ‌ర్శ‌లు చేస్తున్నారు.ఇక రీసెంట్ గా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా దీనిపై చాలా సీరియ‌స్ గా స్పందించింది.ఇక ఆ శాఖ ప్రతినిధి లిజియాన్ జావో ఈ వీడియోను త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో షేర్‌ చేస్తూ అమెరికాను ఎగతాళి చేస్తూ కామెంట్ చేశారు.ఇక చైనా కూడా ఇప్పుడు తాలిబ‌న్ల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న సంగ‌తి అంద‌రికీ విదిత‌మే.

మ‌రి అమెరికా దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube