ప్రమాణ స్వీకారం క్యాపిటల్ భవనంలోనే..ఏం జరగబోతుందో..??  

The swearing-in took place inside the Capitol building, Biden as US President, Kamala Harris as Vice President, January 20th sworn in, US Congress Capital Building, Vice President Mike Pence, Obama, George Bush, Bill Clinton - Telugu Biden As Us President, Bill Clinton, George Bush, January 20th Sworn In, Kamala Harris As Vice President, Obama, Us Congress Capital Building, Vice President Mike Pence

అమెరికా అధ్యక్షుడిగా బిడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హరీస్ జనవరి 20 వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.అమెరికా 46 అధ్యక్షుడిగా బిడెన్ చారిత్రాత్మక విజయాని నమోదు చేశారు.

TeluguStop.com - The Swearing In Took Place Inside The Capitol Building

అయితే బిడెన్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్దం చేస్తున్న తరుణంలో అమెరికా కాంగ్రెస్ క్యాపిటల్ భవనంలో నిర్వహించిన సమావేశ సమయంలో జరిగిన హింస అందరికి గుర్తు ఉండేఉంటుంది.ఈ ఘటన కారణంగా అమెరికన్ కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడ్డారు.

ఎక్కడ హింసాత్మక సంఘటనలు జరుగుతాయో తమ ప్రాణాలకు ముప్పు ఎక్కడ వాటిల్లుతుందోనని ఆందోళన చెందారు.భవిష్యత్తులో మరిన్ని ఆందోళనలు జరిగే అవకాశాలు ఉన్నాయనే సందేహాల నేపధ్యంలో

TeluguStop.com - ప్రమాణ స్వీకారం క్యాపిటల్ భవనంలోనే..ఏం జరగబోతుందో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షుల ప్రమాణ స్వీకారాలు అమెరికా క్యాపిటల్ లోనే నిర్వహించాలా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.

ప్రమాణ స్వీకారానికి కంటే ముందే మరిన్ని దాడులు జరిగే అవకాశముందని హెచ్చరికలు వచ్చిన నేపధ్యంలో మరిన్ని కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.పైగా ఈ ప్రమాణ స్వీకారానికి అతిరధ మహారధులు అందరూ వస్తున్నారు.

మాజీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు తరలిరానున్న సమయంలో భద్రతను మరింత కట్టుదిట్టంచేసి ప్రమాణ స్వీకారం క్యాపిటల్ భవనంలోనే నిర్వహించేలా ప్రణాలికలు సిద్దం చేస్తున్నారు.ఇదిలాఉంటే

ఇప్పటికే ట్రంప్ బిడెన్ ప్రమాణ స్వీకారానికి రానని తేల్చి చెప్పేశారు.ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తాను బిడెన్ ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నాని ప్రకటించారు.అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, జార్జ్ బుష్, బిల్ క్లింటన్ ఈ వేడుకలకు రానుండగా, ఎంతో మంది ప్రముఖులు హాజరుకానున్నారు.

ఇదిలాఉంటే గతంలో ప్రమాణ స్వీకార సమయంలో అనుకున్న కార్యక్రమాలలో కొన్ని కార్యక్రమాలను కుదించారు నిర్వాహకులు.భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.

#Obama #VicePresident #January20th #George Bush #Bill Clinton

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు