చెక్‌బౌన్స్‌ కేసుల్లో పలు మార్గదర్శకాలు సూచించిన సుప్రీంకోర్టు.. !- The Supreme Court Has Issued Several Guidelines In Check Bounce

Supreme Court guidelines in Cheque bounce Cases, Supreme Court, several guidelines, cheque bounce cases, all cases at one time - Telugu All Cases At One Time, Check Bounce Cases, Cheque Bounce Cases, Several Guidelines, Supreme Court, Supreme Court Guidelines In Cheque Bounce Cases

ఎవరైనా జరిపే లావాదేవిల్లో ఎక్కువగా చెక్‌బౌన్స్ అవడం వల్ల కలిగే చికాకు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉండదు.ఇలా చెక్‌బౌన్స్ అయితే చెక్క్ ఇచ్చిన వ్యక్తి పై కేసు ఫైల్ చేయవచ్చూ.

 The Supreme Court Has Issued Several Guidelines In Check Bounce-TeluguStop.com

కానీ ఎన్ని సార్లు చెక్‌బౌన్స్ చేస్తే అన్ని సార్లు కంప్లీంట్ నమోదు చేయవచ్చా అన్నదాంట్లో క్లారీటి లేదు.

అయితే ఇలాంటి వ్యక్తుల విషయంలో సుప్రీంకోర్టు శుక్రవారం పలు మార్గదర్శకాలు జారీచేసింది.

 The Supreme Court Has Issued Several Guidelines In Check Bounce-చెక్‌బౌన్స్‌ కేసుల్లో పలు మార్గదర్శకాలు సూచించిన సుప్రీంకోర్టు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చెక్‌బౌన్స్‌ కేసుల్లో విచారణను వేగవంతం చేసే క్రమంలో ఓ వ్యక్తిపై ఒక లావాదేవీకి సంబంధించి ఏడాది కాలంలో నమోదైన వివిధ చెక్‌బౌన్స్‌ కేసులన్నింటినీ ఒకే కేసుగా పరిగణించి విచారణ జరుపాలని పేర్కొంది.

ఒక వేళ నిందితుడు నేరం ఒప్పుకొంటే దోషిగా నిర్ధారించేందుకు అధికారాలు కల్పించాలని కోరింది.

అయితే క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సెక్షన్‌ 258కింద మేజిస్ట్రేటుకు లభించే అధికారాలు చెక్‌బౌన్స్‌ కేసులకు వర్తించవని గుర్తు చేసింది.ఇకపోతే చెక్‌బౌన్స్‌ కేసుల్లో సాక్షులు ట్రయల్‌ కోర్టులకు అఫిడవిట్‌ సమర్పిస్తే సరిపోతుందని నేరుగా విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నది.

ఈ మేరకు నెగొషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ చట్టానికి (ఎన్‌ఐ చట్టం) సవరణలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.కాగా చెక్‌బౌన్స్ కేసుల సత్వర పరిష్కారానికి తాజాగా సీజేఐ జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మార్గదర్శకాలు జారీచేసింది.

#Supreme Court #SupremeCourt #AllCases #ChequeBounce

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు