సక్సెస్ స్టోరీ: ఒకప్పుడు తినడానికి తిండిలేక కూలిపనులు చేసుకుని బతికాడు..ఇప్పుడు పదిహేను కంపెనీలకు అధిపతి.

అతడు ఒకప్పుడు కడుపు నిండా భోజనం, అతుకులు లేని బట్టలు, కాళ్లకి చెప్పులు వీటికోసం కలలు కంటూ పెరిగాడు…ఇప్పుడు 11 సంస్థలు ఉన్న MMR గ్రూప్స్ చైర్మన్.వందల కోట్ల వ్యాపారాలకు వందల మంది ఉద్యోగులకి అధినేత.

 The Success Story Of Madhusudan Rao Mmr-TeluguStop.com

విదేశీ డాక్యూమెంటరీలు మరియు స్వదేశీ పుస్తకాలలో చోటు దక్కించుకున్న వ్యక్తి…అతడే మన్యం మధుసూదన రావు.

మధుసూదన్ రావుది ప్రకాశం జిల్లా కందుకూరులోని పాలకూరు గ్రామం తండ్రి పేరయ్య తల్లి రాములమ్మకి పుట్టిన ఎనిమిది మంది సంతానంలో మధుసూదన్ రావు 5 వ వాడు.

ఊరికి దూరంగా ఎక్కడో ఉండేది వీరి ఇల్లు.ఇక్కడ మగవారు ఎవరు మోకాలి కింద వరకు కట్టకూడదు.ఆడవారు ఎవరు జాకెట్లు కూడా వేసుకోకూడదు.ఒరేయ్ .ఒసేయ్ ఇవి ఊరి జనాలు వీరికి ఇచ్చిన పేర్లు.వీరికి వారసత్వంగా వచ్చినది పేదరికం మాత్రమే.

అందరు పని చేస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితి మూపుటాల తాగేది తినేది గంజి మరియు రాగి సంగటి .ఇదీ ఆ కుటుంబం పరిస్థితి.కుటుంబ సభ్యుల త్యాగాల వల్ల మధుసూదన్ మరియు తన అన్న చదువుకోగలిగారు.ఊర్లో ఆరో తరగతి వరకు చదువుకున్న అన్నదమ్ముల మకాం సంక్షేమ హాస్టల్లకి మారింది అక్కడైనా మంచి భోజనం దొరుకుతుంది అని అనుకున్నారు.

అక్కడ కూడా నీళ్ల మజ్జిగలో పురుగులు వచ్చేవి.ఇక వేరే గతిలేక అక్కడే ఉండి టెన్త్ మరియు ఇంటర్మీడియట్ చదివి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు.

బీటెక్ చదివే అవకాశం వచ్చిన ఆర్ధిక పరిస్థితి సహకరించలేదు.హైదరాబాద్ మధుసూదన్ అన్న అప్పటికే బీటెక్ చదువుతుండడంతో మధుసూదన్ డిప్లొమా చేరాడు.ఇక వీరి చదువు అయిపోగానే అన్నదమ్ములు ఇద్దరు హైదరాబాద్ వెళితే ఉద్యోగాలు పక్క అనుకున్నారు కానీ అది అంత సులువు కాదు అని తెలుసుకున్నారు.అలా అని తిరిగి ఊరు వెళ్లలేని పరిస్థితి.

కొడుకులు ఇద్దరు పట్టణంలో సంపాదించి వారిని ఆదుకుంటారు అని ఇంట్లో వారి నమ్మకం.కానీ ఇక్కడ చూస్తే ఉద్యోగాలు లేవు.

చేసేది ఏమిలేక హైదరాబాద్ కూకట్ పల్లి లో ఉన్న అక్క దగ్గరకి వెళ్లారు .ఇక్కడ తన అక్క మరియు బావ నిర్మాణ కూలీలుగా ఉన్నారు.ఆ ఇంట్లో ఇద్దరికంటే ఎక్కువ మంది ఉండడం కష్టం.ఎలాగో ఒకలాగా ఒప్పించి అక్కడే ఉండి పోటీ పరీక్షలకి చదువుకున్నాడు కానీ ఫలితం ఏమి లేదు.బీటెక్ చదివి కూలి పనికి పోయేది ఏంటి అని అనుకోకుండా తన కుటుంబం గురించి ఆలోచించి వారికీ నెలనెల డబ్బులు పంపే వాడు.ఇలా తన జీవితం కూలి వాడిగా మొదలు పెట్టాడు.

ఒక రోజు ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా ఒక కంపెనీ ఇంటర్వ్యూ వెళ్లారు మధుసూదన్ అక్కడ నిరాశే కానీ అక్కడ ఇద్దరు మాటలాడుకుంటున్న మాటలు మధుసూదన్ రావు జీవితాన్నే మార్చేశాయి.అక్కడ ఇద్దరు వ్యక్తులు తమ టెలి ఫోన్ కేబుల్కి కూలీలు దొరకడం లేదు అని పనికి చాల కష్టంగా ఉంటుంది అని చెబుతుంటే మధుసూదన్ విన్నాడు.

తమ ఊరిలో పని లేకుండా చాలా మంది ఉన్నారు అని వారిని నేను తీసుకొస్తా అని చెప్పగా కంపెనీ వారు నమ్మలేదు.ఇక మధుసూదన్ రావు పదే పదే అడగగా సరే అడ్వాన్స్ ఏమి ఇవ్వకుండా రాత్రికి అందర్నీ సైట్ దగ్గరకి తీసుకోనిరమన్నారు.

ఇప్పుడు ఊరి వారందరిని అడ్వాన్స్ ఇవ్వకుండా ఎలా పిలుచుకొని పోవడం అని ఆలోచించాడు.ఇక ఎవర్నన్నా డబ్బు అడుగుదామా అంటే తనకు హైదరాబాద్లో తన అక్క బావ తప్ప ఎవరు తెలీదు.కడుపు నిండా ఇక చేసేది ఏమి లేక తన అక్కని ఒక రూ.3000 సర్ధమన్నాడు రాత్రికి అంతా ఇస్తానున్నాడు.వాళ్లని వీళ్లని అడిగి తొమ్మిందొందలు తీసుకొస్తే వాటిని తీసుకుని వెళ్లి.ఒక బండిలో పక్కనే ఉన్న బస్తీలో ఒక 15 మంది కూలాల్ని తీసుకొచ్చి సైట్ దగ్గర పని చేపించి భోజనం మరియు టీ ఇప్పించేవాడు.మొదటి రోజు చేసిన పనికి మధుసూదన్ కు వచ్చిన ఆదాయం రూ.20000 అన్ని పోగా మిగిలిన డబ్బు అక్కకి ఇచ్చి అంతా కడుపు నిండా భోజనం చేశారు.

ఇక అక్కడి నుండి మధుసుధన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు రూ.20000 నుంచి రూ.2 కోట్ల కాంట్రాక్టర్ గా ఎదిగాడు.ఊర్ల నుంచి కూలీలను పిలిపించి వారికీ మోసం చేయడకుండా డబ్బులు ఇచ్చి పని చేయించుకునే వాడు ఇది చుసిన ఒక పెద్దాయన ఎన్ని రోజులు ఇలా చిన్న కాంట్రాక్టులు చేస్తావ్ నాతో చేయి కలుపు స్టేట్ మొత్తం దుములేపుదాం అని చెప్పారు.

ఇక ఒక కంపెనీ పెట్టాలి అని చెప్పాడు దీన్ని గుడ్డిగా నమ్మిన మధుసూదన్ రావు తాను సంపాదించింది అంతా తీసుకెళ్లి తన చేతిలో పెట్టాడు.తీరా ఒకసారి డబ్బులు కావాలి అని మధుసూదన్ అడిగితి కంపెనీ నష్టాలలో ఉంది అని ఇచ్చేది లేదు అని చెప్పడంతో అతని కాళ్ళ కింద భూమి కదిలినంత పని అయింది.

అంగబలం, అర్ధబలం లేని మధుసూదన్ చేసేదేం లేక బెంగుళూరులో ఒక కంపెనీలో పనికి చేరాడు నెలకు రూ.10 వేలు జీతం అది కూడా టెలికాం రంగానికి సంబంధించిన కంపెని.ఇలా జీవితం గడిచిపోవడం సరికాదు అని తెలుసుకొని తన భార్య తరుపున నుంచి రూ.3 లక్షల వార్ప్ర్రాకు పోగేసాడు మళ్లీ కంపెనీ పెట్టాడు ఇదే మధుసూదన్ గారికి సెకండ్ లైఫ్ ఇప్పుడు MMR కి 40 ఏళ్ళు.మరో 7 ఏళ్లలో రిటైర్ అయిపోతా అని అంటున్నారు.ఇలా రిటైర్ ఐన తర్వాత ఒక ట్రస్ట్ పెట్టి అందరికి సహాయం చేయాలి అని అనుకుంటున్నాడు .తన లాగా ఎవరు తిండి కోసం బాధపడకూడదు అనేది మధుసూదన్ ఫిలాసఫి.ప్రస్తుతం ఈయన దళిత్ ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్నారు.

ఇక తన గురించి డిఫైనింగ్ ది ఆడ్స్, ది రైస్ అఫ్ దళిత్ పుస్తకాలలో ప్రధానంగా ప్రచురించారు.విదేశీ పత్రికలూ కూడా మధుసూదన్ రావు గారి గురించి ప్రచురించాయి కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటి అంటే మన తెలుగు వారికీ ఈయన గురించి తెలియకపోవడం బాధాకరం.

మరుమూల పల్లె నుంచి వచ్చిన ఒక యువకుడు ఇలా సమాజంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదిస్తాడు అని ఎవరైనా అనుకుంటారా? ని సాధారణంగా సినిమాలో హీరోలు ఒక పాట అయిపోయేలోపల కొట్టేశ్వర్లు అవ్వడం మనం చూసాం, కానీ నిజజీవితంలో ఎక్కడ చూడలేము.కానీ తన చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

రియల్లీ గ్రేట్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube