కేవలం రూ. 500లతో కలుపుతీసే యంత్రాన్ని కనిపెట్టిన విద్యార్థిని.!

చదువు ఎవ్వరైనా చదివేస్తారు.కానీ కొంతమందే తాము చదివిన చదువుకి ఓ సార్ధకత చేకూరుస్తారు.

 The Student Who Invented The Machine That Combines 500s   Bsc Student, Agricultu-TeluguStop.com

ఆ రెండో కోవకు చెందిన విద్యార్థిని పేరే కాసం శర్వాని.అవును.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్‌ సిటీ కాలనీలో ఈమె నివాసం.మొదటి నుండి ఈమెకు వ్యవసాయం అంటే కొంచెం మక్కువ ఎక్కువ.

అందువలనే పనిగట్టుకొని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ లోగల శ్రీ సంతు శంకర్‌ మహారాజ్‌ కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ లో బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సు చదువుతోంది.

ఇకపోతే… ఈ కరోనా పుణ్యమాని లాక్‌ డౌన్‌ మూలాన కళాశాలలు తెరవక పోవడం వలన ఆమె తన ప్రాజెక్టుల పైన దృష్టి పెట్టింది.ఇందులో భాగంగానే, రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందాలనే ఉద్దేశంతో, ఆన్‌ లైన్‌ లో కలుపు యంత్రాలను తయారు చేసే విధానాలకు సంబంధించిన వీడియోలు చూసి, తనకు అందుబాటులో ఉన్న పరికరాలతో కేవలం రూ.500లను మాత్రమే ఖర్చు చేసి కలుపు యంత్రాన్ని సునాయాసంగా తయారు చేసేసింది.

దీనిలో భాగంగా ఆమె ఓ పాత సైకిల్‌ రీమ్, ఒక పెద్ద ఇనుప రాడ్డు, షార్పుగా ఉన్న మేకులు కొన్నింటిని మాత్రమే తీసుకొని దాన్ని ఓ యంత్రం షేపుకి తీసుకొచ్చి వెల్డింగ్ చేయించింది.దీన్ని ఉపయోగించి రైతులు ఎంచక్కా కలుపు తీసుకోవచ్చు.

అంతేకాకుండా ఇక్కడ మనం డీజిల్, పెట్రోల్‌ ఉపయోగించాల్సిన పనేలేదు.దీనివలన ఇంకో ఉపయోగం ఏమంటే కలుపును త్వరగా, తేలికగా తీయవచ్చు.

తద్వారా.రైతులకు కష్టం కలగకుండా ఎంతో సమయం ఆదా అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube