మణిరత్నంకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన శిష్యురాలు... ఎలానో తెలుసా?

ప్రముఖ దర్శకులు సుధా కొంగర పూర్వాశ్రమంలో ఎంతో పేరుప్రఖ్యాతులు గాంచిన ది లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంకు శిష్యురాలు.మణిరత్నం దగ్గర దాదాపుగా ఏడు సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్ గా సుధా కొంగర పని చేసిన విషయం తెలిసిందే.

 Maniratnam,student,sudha Kongara,akashame Ne Haddu Ra,super Gift, Sudha Kongara,-TeluguStop.com

అయితే ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వం వహించిన “ఆకాశం నీ హద్దురా” చిత్రం దీపావళి కానుకగా అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఓటిటి లో విడుదలైన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

సుధా దర్శకత్వం వహించిన సినిమాలను పరిశీలిస్తే అక్కడక్కడ తన గురు ప్రభావం కచ్చితంగా కనిపిస్తుంది.ఇప్పుడు విడుదలైన ఆకాశం నీ హద్దురా సినిమాల్లో కూడా అక్కడక్కడ మణిరత్నం శైలి కనిపించింది.

నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ సినిమాలో 90 నాటి సన్నివేశాలు వచ్చినప్పుడు “గీతాంజలి”సినిమా థియేటర్ లో ప్రదర్శితమవుతున్నట్లు చూపించారు.ఇక 2000లో జరిగిన సన్నివేశాలు వచ్చినప్పుడు సఖి సినిమా పోస్టర్స్ గోడలపై కనిపించడంతో సుధా ఇలా తన గురు భక్తిని చాటుకున్నారు.

ఈ విధంగా మణిరత్నం అందించిన క్లాసిక్స్ ని తన డ్రీమ్ ప్రాజెక్ట్ లో ప్రోజెక్ట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.

Telugu Akashamene, Maniratnam, Sudha Kongara, Gift-Movie

ఈ చిత్రంలో సూర్య, అపర్ణ బాలమురళి, మోహన్ బాబు, పరేష్ రావెల్, ఊర్వశి ప్రధాన పాత్రలలో నటించారు.వాస్తవానికి ఈచిత్రం థియేటర్లలోనే రిలీజ్ చేయాల్సి ఉండగా, కరోనా కారణం వల్ల ఓటిటి ప్లాట్ ఫామ్ వేదికగా విడుదలై అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఇందులో సూర్య ఒక ఎయిర్ఫోర్స్ ఉద్యోగిగా పనిచేస్తూ ఎప్పటికైనా సొంత ఎయిర్ లైన్స్ నడపాలన్న ఉద్దేశంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరకు తన లక్ష్యం ఎలా చేరాడనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హీరో సూర్య నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube