ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ వాడిన బుల్లెట్ బండి అసలు కథ ఏమిటంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం” ఆర్ఆర్ఆర్”.ఈ సినిమాలో ప్రముఖ నటులు రామ్ చరణ్ తేజ్ ,ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

 The Story Of The Real Bullet Used By Ntr In Rrr, Rrr, Bulle Bike, Ntr,ram Charan-TeluguStop.com

రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లను చిత్ర బృందం విడుదల చేసింది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ విడుదల అయిన సంగతి మనకు తెలిసిందే.ఈ పోస్టర్ లో రామ్ చరణ్ గుర్రం మీద కనిపించగా ఎన్టీఆర్ బుల్లెట్ పై మనకు కనిపిస్తారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ వాడిన బుల్లెట్ బండికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం దాగి ఉంది.అదేమిటంటే.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ట్రిపుల్ ఆర్ 1920 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ సినిమా కావడంతో ఈ సినిమాలో ఉపయోగించే బుల్లెట్ కూడా ఆ కాలం నాటి కి సంబంధించినది ఉండాలని ప్రత్యేకంగా చిత్రబృందం ఈ బండిని తయారు చేశారు.

Telugu Bullet Bike, Ram Charan-Movie

అప్పటి కాలానికి చెందిన ఈ బుల్లెట్ బండి వెలాసిటీ మ్యాక్ 350 సీసీ.మోటార్ సైకిల్.అయితే ఈ బండిలో కేవలం ఒక మ‌నిషి మాత్ర‌మే కూర్చుని నడపాల్సి ఉంటుంది.

ఈ విధంగానే ఈ బండిని చిత్రబృందం డిజైన్ చేశారు.ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తాజాగా చిత్రబృందం సినిమా విడుదల తేదీని ప్రకటించింది.

ఈ సినిమాలో సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ తొలిసారిగా తెలుగు తెరకు పరిచయం కానున్నారు.అజ‌య్ దేవ‌గ‌ణ్‌, స‌ముద్ర‌ఖ‌ని, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడితో పాటు ఎన్టీఆర్ జోడీగా న‌టిస్తున్న హాలీవుడ్ తార ఒలివియా మోరిస్ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య సుమారు 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube