మిస్టరీ : 5 ఏళ్ల వయసుకే తల్లి అయ్యింది, ప్రపంచంలోనే అతి చిన్న తల్లి గురించి అవాక్కయే విషయాలు  

అమ్మాయిల వయసు మినిమంగా 18 ఏళ్లు అయితేనే తల్లి అయ్యేందుకు సిద్దం అయినట్లుగా భావించాలి.కొందరు అమ్మాయిలు బలహీనంగా ఉండటం వల్ల 20 ఏళ్ల వరకు కూడా అమ్మ అయ్యేందుకు సిద్దం అవ్వరు.

TeluguStop.com - The Story Of Lina Medina Who Became A Mother At The Age Of 5 Years 5

కాని మనం గతంలో 15 ఏళ్ల లోపు అమ్మాయిలు కూడా తల్లి అయిన విషయాలను మీడియాలో వచ్చిన వార్తల ద్వారా చూశాం.అలాంటి వార్తలు చూసిన సమయంలో ఆశ్చర్య పోతాం.

మరి ఆ వార్తలకే ఆశ్చర్య పోతే లీనా మెడినా గురించి తెలిస్తే నోరెళ్లబెడతారేమో.ఆమె వయసు ప్రస్తుతం 85 ఏళ్లు.

TeluguStop.com - మిస్టరీ : 5 ఏళ్ల వయసుకే తల్లి అయ్యింది, ప్రపంచంలోనే అతి చిన్న తల్లి గురించి అవాక్కయే విషయాలు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆమెకు 80 ఏళ్ల క్రితం కొడుకు జన్మించాడు.కొడుకు మరణించినా తల్లి బతికే ఉంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… 1933లో లీనా మెడినా అనే అయిదు సంవత్సరాల బాలిక డెలవరీ అయ్యింది.ఆ సమయంలో ఉన్న టెక్నాలజీ సాయంతో నార్మల్‌ డెలవరీ కాకుండా సిజేరియన్‌ చేయడం జరిగింది.అయిదు సంవత్సరాల వయసులోనే లీనా తల్లి అయ్యింది.లీనా కడుపులో ఏదో కణితి ఉందని, అది పెరిగి పెద్దగా అవుతుందని భావించిన తల్లిదండ్రులు ఆమెను డాక్టర్‌ వద్దకు తీసుకు వెళ్లారు.

డాక్టర్లు పరీక్ష చేసి లీనా గర్బవతి అని నిర్ధారించారు.వారు ఆ విషయాన్ని నమ్మలేదు.మరో ఇద్దరు ముగ్గురు డాక్టర్లను సంప్రదించింనా కూడా అదే మాట.అప్పటికే లీనా 7 నెలల గర్బవతి.దాంతో ఆమెకు అబార్షన్‌ చేసే పరిస్థితి లేదు.తప్పనిసరి పరిస్థితుల్లో డెలవరీ చేయడం జరిగింది.

అయిదు సంవత్సరాల వయసులోనే తల్లి అవ్వడం ఎలా సాధ్యం అయ్యింది.అసలు ఆమె తల్లి కావడంకు కారణం ఏంటీ అనే విషయాలు ఇప్పటికి కూడా మిస్టరీగానే ఉన్నాయి.మూడు సంవత్సరాల వయసు నుండే లీనా రుతుక్రమం ప్రారంభం అయ్యిందట.అయిదేళ్ల వయసులో ఎవరో ఆమెను రేప్‌ చేశారు.దాంతో ఆమె గర్బవతి అయ్యింది.మొదట లీనా తండ్రిపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

దాంతో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి ఎంక్వౌరీ చేశారు.అయితే అతడి తప్పేం లేదని పోలీసులు గుర్తించారు.

లీనా వయసు 10 ఏళ్లు ఉన్న సమయంలో ఆమెకు పుట్టిన బాబు వయసు 5 సంవత్సరాలు ఉండేది.ఆ పిల్లాడితో లీనా కలిసి ఆడుకోవడం కలిసి స్కూల్‌కు వెళ్లడం చేసేది.ప్రపంచంలోనే అత్యంత చిన్న తల్లిగా ఇప్పటికి లీనా రికార్డుగా ఉంది.లీనాకే ఈ రికార్డ్‌ ఉండాలని అంతా కోరుకుంటారు.అలాంటి ప్రెగ్నెన్సీ మళ్లీ ఎవరికి రావద్దని కోరుకుందాం.లీనాకు పుట్టిన తనయుడు 40 ఏళ్ల వయసులో అంటే లీనాకు 45 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మృతి చెందాడు.

ఆ సమయంలో లీనా కన్నీటి పర్యంతం అయ్యిందట.లీనా 1970 లో పెళ్లి చేసుకోగా మరో బిడ్డకు జన్మనిచ్చింది.

ప్రస్తుతం కూడా ఆమె ఆరోగ్యంగా ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

The Story Of Lina Medina Who Became A Mother At The Age Of 5 Years 5 Related Telugu News,Photos/Pics,Images..