చాలా వరకు సినిమాల కథలను ఏదైనా ఊహించి లేదా బయట జరిగే కొన్ని సంఘటనలను తీసుకొని వాటిని మార్చి మార్చి రూపుదిద్దుతారు.ఇలా చాలావరకు బయట తీసుకున్న కథలు సినిమాలలో చేస్తుంటారు.
ఇదిలా ఉంటే కొన్ని సినిమాలు మాత్రం కొందరి నిజజీవితంలో జరిగిన సంఘటనలను అనుసరించి సినిమాలలో చూపిస్తారు.చాలా వరకు ఇలాంటి కథలే ఎక్కువగా విజయాన్ని అందిస్తాయి.
మలయాళం లో తెరకెక్కిన దృశ్యం సినిమా గురించి అందరికీ తెలిసిందే.ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ చేయగా మంచి విజయాన్ని సాధించింది.
చాలా వరకు ఒక భాషలో విజయం సాధించిన సినిమాలు మరో భాషలో అంత విజయాన్ని సాధించలేకపోయాయి.కానీ అన్ని భాషలలో మంచి విజయాన్ని సాధించిన సినిమా దృశ్యం.
ఇటీవలే దృశ్యం 2 విడుదల కాగా.ఈ సినిమా వాస్తవంగా జరిగిన ఘటన నుంచి ఎన్నుకున్నారని డైరెక్టర్ జీతు జోసెఫ్ తెలుపుతున్నాడు.
దృశ్యం సినిమా బయటనుంచి సేకరించిన కథలు ఆధారంగా కాకుండా.ఓ వ్యక్తి నిజజీవితంలో జరిగిన సంఘటనను ఈ సినిమా ద్వారా పరిచయం చేశాడు.ఇందులో ప్రధాన పాత్రధారి అయినా జార్జి కుట్టి అనే వ్యక్తి నిజంగా ఉన్నట్లుగా వెల్లడించాడు.ఈ సినిమాలో తొలి భాగంలో జరిగిన హత్య, దాని నుండి కాపాడుకోవడం కోసం ఓ కుటుంబం చేసిన ప్రయత్నం అంతా నిజంగా జరిగిందంటూ దర్శకుడు తెలిపాడు.
కానీ ఆ వ్యక్తి పోలీసులకు దొరకగా.సినిమాలో మాత్రం వ్యక్తిని ప్రధాన పాత్రగా తీసుకొని పోలీసులకు దొరకకుండా ఆ వ్యక్తి పకడ్బందీగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో అని ఈ కథను రాశానని తెలిపాడు.
ఇక ఇందులో జార్జి కుట్టి పాత్రలో ఉన్న లక్షణాలు.దర్శకుడు తన తండ్రి నుంచి తీసుకున్నట్లు తెలిపాడు.
అందుకే ఈ సినిమా థ్రిల్లర్ గా ఆకట్టుకుంది.