ఆ రాష్ట్ర మంత్రి 50 అడుగుల ఎత్తుపైకి వెళ్లాల్సివచ్చింది.. ఎందుకో తెలిస్తే నవ్వుతారు.. !  

the-state minister had to go 50 feet high Madhya Pradesh, Minister, Brijendra Singh Yadav, 50 feet high, cell call ,madyapradeh - Telugu 50 Feet High, Brijendra Singh Yadav, Cell Call, Madhya Pradesh, Minister

మనదేశాన్ని పాలించే నేతలు చెప్పేది ఒకటి జరుగుతున్నది ఒకటి.మన ఇండియా అభివృద్ధి పధంలో దూసుకు వెళ్లుతుందని అంటారు.

TeluguStop.com - The State Minister Had To Go 50 Feet High

కానీ అప్పుల పరంగా ముందుందని చెప్పరు.ఇక ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఏంటని ప్రశ్నిస్తే ఏవేవో పిట్టకధలు చెబుతారు.

ఇక ఈ మధ్య ఇండియాలో వినిపిస్తున్న డిజిటల్ ఇండియా పథకం అనే పేరు, పేరుకే డిజిటల్ ఇండియా గా మిగిలిపోతుందంటారు ఈ విషయం తెలుసుకుంటే.ఆ వివరాల్లోకెళితే మధ్యప్రదేశ్, అశోక్ నగర్ జిల్లాలోని అంఖో గ్రామానికి ఆ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ అధికారిక పర్యటనలో భాగంగా వచ్చారట.

TeluguStop.com - ఆ రాష్ట్ర మంత్రి 50 అడుగుల ఎత్తుపైకి వెళ్లాల్సివచ్చింది.. ఎందుకో తెలిస్తే నవ్వుతారు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలో స్థానికులు తమ గ్రామంలో నెలకొన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఈ అంశం గురించి ఆఫీసర్లతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నం చేయగా అతని ఫోన్‌లో సిగ్నల్స్ లేవట.దీంతో చేసేది ఏం లేక మంత్రి 50 అడుగుల ఎత్తులో గల జెయింట్ వీల్‌పైకి ఎక్కి ఫోన్ మాట్లాడారట.

ఇలా దాదాపు 3 గంటలపాటు అక్కడే కూర్చొని మాట్లాడిన మంత్రి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ఈ నేపథ్యంలో నెటిజన్లు కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా ప్రోగ్రాంను విమర్శిస్తూ, మీమ్స్, జోక్స్ ను నెట్టింట క్రియేట్ చేస్తున్నారట.

#BrijendraSingh #Cell Call #Minister #Madhya Pradesh #50 Feet High

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు