సాధారణంగా అభిమాన హీరోలు కనబడితే పెద్ద ఎత్తున వారితో సెల్ఫీలు దిగడం ఆటోగ్రాఫ్ ఇప్పించుకోవడం జరుగుతుంది.ఈ క్రమంలోనే సెలబ్రిటీలు బయటకు వస్తే పెద్ద ఎత్తున అభిమానులు వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
ఇకపోతే సుమ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి క్యాష్ కార్యక్రమంలో ఇదివరకు కాలేజ్ స్టూడెంట్స్ సందడి చేసేవారు.అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం ఆగిపోవడంతో సుమా వ్యాఖ్యాతగా సరికొత్త కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
సుమ అడ్డా అనే పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ కార్యక్రమంలో కూడా కాలేజీ స్టూడెంట్స్ సందడి చేస్తున్నారు.
ఇక ఈ కార్యక్రమానికి సినీ సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున తమ సినిమా ప్రమోషన్ల కోసం ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.ఈ క్రమంలోనే సుదీర్ బాబు హీరోగా నటించిన హంట్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హంట్ చిత్ర బృందం సుమ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా సుమ కాలేజీ స్టూడెంట్స్ ను ఓ ప్రశ్న వేశారు.
ఈ సందర్భంగా సుమా ప్రశ్నిస్తూ అబద్ధాలు ఎవరు ఎక్కువగా చెబుతారని అడగడంతో వెంటనే ఒక అబ్బాయి ఆడవాళ్ళు ఎక్కువగా అబద్ధాలు చెబుతారు అంటూ సమాధానం చెప్పారు.దీంతో అక్కడే ఉన్నటువంటి మరొక అమ్మాయి మైక్ అందుకొని ఒక పెగ్గు తాగి ఊగిపోయే నువ్వు అబద్దాల గురించి మాట్లాడుతున్నావా అంటూ ఆ అబ్బాయి వైపు చాలా సీరియస్ గా చూస్తూ తనకు వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడారు.దీంతో ఆ అమ్మాయి వార్నింగ్ చూసి భయపడిన సుధీర్ బాబు తనకు ఆటోగ్రాఫ్ ఇవ్వకపోతే తనని కూడా ఏదో ఒకటి అంటుందన్న ఉద్దేశంతో తనకు ఆటోగ్రాఫ్ ఇచ్చేసారు.
ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.