మెగాస్టార్ కు లైఫ్ ఇచ్చింది ఆ స్టార్ హీరోనా.. ఇన్నాళ్లు చెప్పనే లేదే?

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా పెళ్లి సందD. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఈ నెల 15 వ తేదీన విడుదల కాబోతుంది.

 The Star Hero Who Gave Life To The Megastar Chiranjeevi Details, Chiranjeevi, T-TeluguStop.com

కాగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు.అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఇదిలా ఉండగా… చిరంజీవి మాట్లాడుతూ.రాఘవేందర్ రావు గారితో తన ప్రయాణం సుదీర్ఘమైనదని మెగా స్టార్ చిరంజీవి అన్నారు.80’s లో చూస్తే ఆయన దర్శకత్వంలో తీస్తే గానీ ఏ భరోసా ఉండదు అనే నమ్మకం ఉండేదని ఆయన అన్నారు.కెరీర్ ప్రారంభంలో ఆయనతో మోసగాడు అనే సినిమా చేశానని ఆయన తెలిపారు.

ఆ తర్వాత అడవి దొంగ లో నటించానని చిరంజీవి చెప్పారు.ఆ మూవీ అప్పట్లో ఎంత విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే.

అయితే అప్పటికే ఎన్టీఆర్ పొలిటికల్ గా వెళ్లిపోవడంతో అందరూ ఇక రెవెన్యూ పరంగా అంత హిట్స్ రావనే మీమాంసలో ఉన్నారని ఆయన అన్నారు.ఆ సమయలోనే ఈ సినిమా రావడంతో ఆర్థికంగా చాలా మేలు జరిగిందని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు.

Telugu Chiranjeevi, Raghavendra Rao, Roshan, Senior Ntr, Sri Kanth, Sri Leela, T

ఇక శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీలా ప్రధాన పాత్రలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో, రొనంకి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెళ్లి సందD ఈ సినిమా ఈ నెల 15 వ తేదీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మరి ఈ సినిమా ద్వారా రోషన్ శ్రీకాంత్ పెళ్లి సందడి సినిమాను మైమరిపిస్తారా లేదా అనే విషయం మరి కొద్ది రోజులలో తెలియనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube