నిప్పులపై నడిచిన స్టార్ క్రికెటర్.. క్రికెట్ ప్రాక్టీస్ ఇలా కూడా చేస్తారా..!

ఆసియా కప్ 2023 టోర్నీ ఆగస్టు 31వ తేదీ నుండి ప్రారంభం అవనున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ టోర్నీలో పాల్గొనే దేశాలన్నీ ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాయి.

 The Star Cricketer Who Walked On Fire Can You Do Cricket Practice Like This Too-TeluguStop.com

ఆసియా కప్ 2023 టోర్నీ టైటిల్ గెలిచేందుకు అన్ని జట్లు ఎంతో కసితో కఠినమైన ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఈ ప్రాక్టీస్ లో భాగంగానే బంగ్లాదేశ్ యువ ఆటగాడైన మహమ్మద్ నయీమ్( Mohammed Naeem ) ఏకంగా నిప్పులపై నడవడం ఆసక్తికరంగా మారింది.ఈ ఆటగాడు నిప్పులపై నడవటం వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.ఈ వీడియో చూసిన వారంతా క్రికెట్ ప్రాక్టీస్ ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యపోతున్నారు.

క్రికెట్ ప్రాక్టీస్ కు( Cricket practice ) నిప్పుల పై నడవడానికి సంబంధం ఏంటి అని చాలామందికి అర్థం కావడం లేదు.అయితే మానసిక ఒత్తిడి తట్టుకోవడం కోసం ఇలా నిప్పుల పై నడుస్తున్నాడు.

క్రికెట్ మ్యాచ్ లో ఒత్తిడికి లోను కాకుండా ఉండేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు.సబిత్ రేహాన్ అనే ట్రైనర్ సమక్షంలో ఈ ఫిట్ సాధించాడు.

క్రీడాకారులు నిప్పులపై నడవడం కొత్తేం కాదు.గతంలో పలువురు ఆటగాళ్లు నిప్పులపై వాకింగ్ చేశారు.ధైర్యాన్ని పెంచుకోవడంతో పాటు మానసికంగా దృఢంగా ఉండేందుకు ఈ నిప్పులపై వాకింగ్ ఉపయోగపడుతుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు.ఇక 23 ఏళ్ల మహమ్మద్ నయీమ్ కు అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అనుభవం లేదు.

ఇతను తన కెరీర్లో ఒక టెస్ట్ మ్యాచ్, నాలుగు వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడాడు.ఇతని అత్యధిక స్కోర్ కేవలం 24 పరుగులే.వన్డేలలో అయితే ఒకసారి కూడా రెండు అంకెల స్కోర్ నమోదు చేయలేకపోయాడు.ఆసియా కప్ లో ఎలాగైనా రాణించి ప్రత్యేక గుర్తింపు పొందాలని పట్టుదలతో కఠినమైన ప్రాక్టీస్ చేస్తున్నాడు.

ఆసియా కప్ టోర్నీలో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో తలపడనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube