ఆ మ్యాచ్ కంటే నా బిడ్డ డైపర్ మార్చడమే తనకు ముఖ్యం అంటున్న స్టార్ బ్యాట్స్మెన్..!

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద దుమారం రేపుతున్నాయి.టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లు చూడటం కన్నా నా బిడ్డ డైపర్లు మార్చడం నాకు ముఖ్యం అని ఆయన అనడంతో ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి.

 Viral Latest, Viral Comments, Newzwland Match, Crane Villiams ,dabul Century,idi-TeluguStop.com

సొంత దేశంలో పాకిస్థాన్ తో రెండు టెస్టుల సిరీస్ ఆడి.రెండు టెస్టు సిరీస్ లలో గెలిచి క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్ ప్రస్తుతం ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలుస్తోంది.బుధవారం ముగిసిన రెండవ టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పాకిస్థాన్ పై 176 పరుగుల తేడాతో గెలుపొందింది.ఈ టెస్ట్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టు విజయంలో కీలక పాత్ర వహించారు అని చెప్పుకోవచ్చు.

ఈ మ్యాచ్ ముగిసిన తరువాత కేన్ విలియమ్సన్ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఒక విలేకరి.

భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌లు చూస్తారా? అని ప్రశ్నించాడు.దీంతో కేన్ మాట్లాడుతూ.

నా కుమార్తెకు పాలు పాటిస్తూ డైపర్లు మార్చుతూ.ఖాళీ సమయం దొరికినప్పుడల్లా భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌లు చూశాను.

క్రికెట్ ఆట చూడడానికి చాలా గొప్ప గానే ఉంటుంది కానీ టెస్ట్ మ్యాచులు పూర్తిగా చూడలేము.ఈ టెస్ట్ మ్యాచులు కన్నా నా పాపకు పాలు పట్టించడం డైపర్లు మార్చడం నాకు ముఖ్యం అని అన్నారు.

దీంతో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Telugu Crane Villiams, Newzwland, Latest-Latest News - Telugu

డిసెంబర్ 16వ తేదీన తమకు ఒక బిడ్డ పుట్టింది అని కేన్ విలియమ్సన్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే.30 ఏళ్ల కేన్ ఒక అమ్మాయికి తండ్రి అయ్యాడన్న విషయం తెలుసుకున్న క్రికెట్ ప్రముఖులంతా ఆయనకు కంగ్రాచ్యులేషన్స్ తెలిపారు.విలియమ్సన్ తనకు బిడ్డ పుట్టిందని వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో వైదొలిగారు.

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఆయన డబుల్ సెంచరీ చేశారు.విలియమ్సన్ 251 పరుగులు చేసి 134 పరుగుల తేడాతో విజయం సాధించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube