అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్టిన శ్రీలంక కెప్టెన్‌.. ఫిదా అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్‌

క్రికెట్‌లో జ‌రిగిన‌న్ని విన్యాసాలు ఇంకెక్క‌డా జ‌ర‌గ‌వేమో అనిపిస్తుంది.ఎందుకంటే కొంద‌రు క్రికెట‌ర్లు త‌మ అద్భుత‌మైన టైమింగ్‌తో చేసే ఫీల్డింగ్ చూస్తే క‌ళ్లు కూడా న‌మ్మ‌లేవేమో.

 The Sri Lankan Captain Who Made An Amazing Catch .. Cricket Fans Who Are Falling-TeluguStop.com

వారి మెరుపు వేగంతో చేసే ఫీల్డింగ్ గానీ లేదంటే ప‌ట్టే క్యాచులు గానీ క్రికెట్ అభిమానుల‌ను క‌ట్టి ప‌డేస్తుంటాయి.అద్భుత‌మైన ఫీల్డింగ్ ముందు ఏ జ‌ట్టు అయినా త‌డ‌బ‌డాల్సిందే.

ఇందుకు సంబంధించి క్రికెట్‌లో కూడా ఒక సామెత ఉందండోయ్‌.అదే క్యాచస్ విన్ మ్యాచస్ అనే ప‌దం అంద‌రికీ తెలిసిందే.

కదా ఇప్పుడు ఈ సామెత శ్రీలంక టీమ్ కు స‌రిగ్గా స‌రిపోతుంది.

రీసెంట్ గా ఆ దేశ జ‌ట్టు నమీబియా టీమ్ తో క్రికెట్ మ్యాచు ఆడింది.

కాగా ఈ మ్యాచులో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో గెలిచింది.ఇందులో త‌న మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ కావ‌డంతో అద్భుత‌మైన ఫీల్డింగుతో క్యాచులు పట్టి ఈజీగా గెలిచేసింది.

కాగా ఏ జ‌ట్టు అయినా కీల‌క ఆట‌గాళ్ల క్యాచుల‌ను చేజార్చుకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.ఇది ఎన్నో సార్లు నిరూపితం అయింది.

కానీ శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక మాత్రం ఇందుకు అవ‌కాశం ఇవ్వ‌కుండా అద్భుతమైన టైమంగ్ తో ప‌ట్టిన క్యాచ్ ఇప్పుడు నెట్టింట్లో చెక్క‌ర్లు కొడుతోంది.

19 వ ఓవర్‌లో లంక బౌలర్ చమీరా వేస్తున్నాడు.కాగా ఈ ఓవ‌ర్‌లో ఓ బంతిని నమీబియా క్రికెట‌ర్ రూబెన్ భారీ సిక్స్ కొట్టేందుకు ప్ర‌య‌త్నించాడు.కానీ అది కాస్తా మిస్ కావ‌డంతో గాల్లోకి లేచింది.

కాగా ఈ బంతి చాలా పైకి వెళ్ల‌డంతో దీన్ని పట్టుకోలేమ‌ని అంచ‌నా వేసేసిన బౌలర్ చమీరా అక్క‌డే ఆగిపోయాడు.కానీ కెప్టెన్ దాసున్ శనక అవ‌కాశం ఇవ్వ‌కుండా ముందుకు వ‌వెళ్లి బాల్ గ్రౌండ్ లో ప‌డ‌బోతున్న స‌మ‌యంలో అద్భుతంగా డ్రైవ్ చేసి మ‌రీ ఒంటి చేత్తో ఒడిసి పట్టుకున్నాడు.

ఇంకేముంది మ్యాచ్ త‌మవైపు తిరిగిపోయింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube