క‌వ‌ర్‌లో త‌ల పెట్ట‌డంతో ఇరుక్కుపోయిన పిచ్చుక‌.. చివ‌ర‌కు

ఈ సృష్టిలో ఏ జీవి అయినా కూడా త‌న ప్రాణాల‌ను కాపాడుకోవ‌డానికి ట్రై చేస్తుంది.అందుకోసం నిత్యం త‌న ఆహారం కోసం యుద్ధ‌మే చేస్తుంది.

 The Sparrow Trapped By The Head On The Cover To The End, Sparrow, Viral Video, S-TeluguStop.com

అయితే ఇలా చేసే యుద్ధంలో కొన్ని సార్లు గెలుస్తాయి.కొన్ని సార్లు ఓడిపోతాయి.

ఇక మ‌న‌తో పాటు జీవించే జంతువుల గురించి అయితే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఎందుకంటే అవి నిత్యం త‌మ ఆహారం కోస‌మే పోరాడుతుంటాయి.

అయితే మానవుడు త‌యారు చేసిన ప్లాస్టిక్ భూతం చాలా సార్లు ఇత‌ర జీవ‌రాశుల పాలిట మ‌ర‌ణ పాశంలా త‌యార‌వుతోంది.

ప్ర‌స్తుతం ప‌ర్యావ‌ర‌ణాన్ని పాడుచేస్తున్న పెద్ద భూతం ఏదైనా ఉందా అంటే అది ప్లాస్టిక్ ఇందులో అగ్రస్థానంలో ఉంటుందేమో.

మాన‌వుడు తన అస‌వ‌రాల కోసం సృష్టించిన ఈ ప్లాస్టిక్ భూతం ఇప్పుడు ప్ర‌పంచాన్ని కుదిపేస్తోంది.అయితే చివ‌ర‌కు ఈ ప్లాస్టిక్ ఇప్పుడు మ‌నిషికే కాదు ప్రాణికోటికే ముప్పుగా త‌యారైంది.

ఇక పక్షులు అయితే ఈ ప్లాస్టిక్ బారిన ప‌డి చివ‌ర‌కు త‌మ ప్రాణాల‌ను విడుస్తున్నాయి.ఇక ఇప్పుడు కూడా ఓ గోరింక ఇలాగే ప్లాస్టిక్ వ‌ల్ల ప్రాణాల మీద‌కు తెచ్చుకుంది.

అయితే అది ప‌డ్డ క‌ష్టాలు చూస్తుంటే మ‌నసు క‌ర‌గ‌క మాన‌దు.

గోరింక ప్లాస్టిక్ కవర్‌లో త‌న త‌ల‌ను పెట్టి ఇరుక్కుపోతుంది.ఇక దాని త‌ల‌ను ఎలా అందులోంచి బ‌య‌ట‌కు తీయాలో తెలియ‌క ప్రాణ రక్షణ కోసం పోరాడ‌టాన్ని కూడా మ‌నం చూడొచ్చు.ఆకలితో క‌డుపు నింపుకునేందుకు వ‌చ్చిన ఆ గోరింక చివ‌ర‌కు త‌న ప్రాణం కోసం కొట్టుమిట్టాడాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది.

అయితే అక్క‌డ వీడియో తీస్తున్న వ్య‌క్తి దానికి సాయం చేయాల‌ని చూసినా కూడా చివ‌ర‌కు అది ఎలాగోలా త‌ప్పించుకుని ఎగిరిపోతుంది.ఇక దీన్ని చూసిన వారంతా కూడా మనుషులు చేస్తున్న తప్పులకు పక్షులు బ‌లైపోతున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube