మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా 'లవ్ యు రా' సినిమాలోని 'యూత్ అబ్బా మేము' పాట విడుదల

చిన్ను క్రిష్, గీతిక రతన్ జంటగా, ప్రసాద్ ఏలూరి దర్శకత్వంలో సముద్రాల సినీ క్రియేషన్స్ బ్యానర్ పై సముద్రాల మంత్రయ్య బాబు నిర్మాతగా నిర్మించిన సినిమా ‘లవ్ యు రా’.ఈ చిత్రంలోని ‘యూత్ అబ్బా మేము’ అనే పాటను గౌరవనీయులు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేయగా ఇప్పుడు యూట్యూబ్ లో ఈ పాట మంచి స్పందన అందుకుంటుంది.

 The Song Youth Abba Memu From The Movie Love You Ra Was Released By Minister Shri Talsani Srinivas Yadav-TeluguStop.com

కంచరపాలెం మ్యూజిక్ డైరెక్టర్ స్వీకర్ అగస్థి పాడారు ,పాటలు రత్నం బట్లురి రాయగా,ఈశ్వర్ పెరవలి సంగీతం సమకూర్చిన ఈసినిమా కి రవి బైపల్లి సినిమాటోగ్రఫీ అందించారు.బ్రదర్ ఆనంద్ కొరియోగ్రఫీ అందించారు.

ఇంకా ఈ సినిమా లో శేఖర్ బండి , సాయినాగ్, మధుప్రియ, దివ్య, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, జబర్దస్త్ చిట్టి బాబు , జబర్దస్త్ కట్టప్ప లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

 The Song Youth Abba Memu From The Movie Love You Ra Was Released By Minister Shri Talsani Srinivas Yadav-మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా లవ్ యు రా’ సినిమాలోని యూత్ అబ్బా మేము’ పాట విడుదల-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా నిర్మాత సముద్రాల మంత్రయ్య బాబు మాట్లాడుతూ.

మా విన్నపాన్ని గౌరవించి ఈ సినిమా లోని పాటను విడుదల చేయడానికి ఒప్పుకున్నా మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.అయన ఋణం తీర్చుకోలేనిది.

అద్భుతమైన కథ తో సినిమా ను తెరకెక్కించారు.షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేసుకుంటుంది.త్వరలోనే మంచి విడుదల తేదీ తో ప్రేక్షకుల ముందుకు వస్తాం అన్నారు.

దర్శకుడు ప్రసాద్ ఏలూరి మాట్లాడుతూ.ఈ సినిమా లో ‘యూత్ అబ్బా మేము‘ అనే పాటను విడుదల చేసిన మినిస్టర్ శ్రీ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ కథ ను వినగానే ఒకే చేసిన నిర్మాతగారికి కృతజ్ఞతలు.అయన ఇచ్చిన ఈ అవకాశం వినియోగించుకుంటాను.సినిమా చాలాబాగా వచ్చింది.నిర్మాత ప్రతి పైసా కి అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది.

త్వరలోనే ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు.

#Agastya #Love Ra #Prasad Alluri #AbbaMemu #ShriTalsani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు